Gudivada Amarnath : ఒకరిద్దరు వెళ్లి పోతే ఏమీ కాదు
మంత్రి గుడివాడ అమర్నాథ్
Gudivada Amarnath : ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పంచకర్ల రమేష్ బాబు వైసీపీ జిల్లా కన్వీనర్ పదవికి రాజీనామా చేశారు. దీనిపై స్పందించారు గుడివాడ అమర్నాథ్. ఒకటి రెండు చేపలు చచ్చి బయట పెడితే తమ పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదని అన్నారు. పార్టీ అన్నాక కొందరు వస్తుంటారు మరికొందరు వెళ్లి పోతుంటారని వాళ్ల గురించి ఆలోచించాల్సిన టైం తనకు లేదన్నారు గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath).
తమ దృష్టి అంతా ప్రస్తుతం అభివృద్ది కార్యక్రమాల అమలుపై ఫోకస్ పెడుతున్నామని , ఒకరు ఉంటారా లేక ఇతర పార్టీల వైపు చూస్తారా అని తమకు అనవసరం అని పేర్కొన్నారు. ఇవాళ దేశంలోనే ఎక్కడా లేని రీతిలో తమ సర్కార్ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు.
చాలా మంది ఇతర పార్టీల నుంచి వలసలు పెరిగాయని, ఇది తమ నాయకుడు వైఎస్ జగన్ పాలనా దక్షతకు నిదర్శనమన్నారు. ఒకరిద్దరిని పట్టుకుని మొత్తం పార్టీకే నష్టం వచ్చినట్లు ప్రచారం చేయడం మంచి పద్దతి కాదన్నారు గుడివాడ అమర్నాథ్. ఇదిలా ఉండగా మంత్రి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. రాబోయేది తామేనని జోష్యం చెప్పారు.
Also Read : Gandhi Bhavan Dharna : గాంధీ భవన్ లో ధర్నా చేస్తే సస్పెండ్