Sitara Donate 1Cr : ప్రిన్స్ సితార కోటి విరాళం

సాయంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం

Sitara Donate 1Cr : మ‌న‌సంటూ ఉండాలే కానీ ఏదైనా చేయొచ్చు. కోట్లున్నా కొంద‌రు మౌనంగా ఉంటారు. ఖ‌ర్చు చేసేందుకు, సహాయం చేసేందుకు వెనుక‌డుగు వేస్తారు. కానీ ఇంకొంద‌రు మాత్రం తమ‌కు వ‌చ్చిన దాంట్లోంచి కొంత మొత్తాన్ని ధార్మిక కార్య‌క్ర‌మాల‌కు కేటాయిస్తారు. దాతృత్వం అన్న‌ది ఒక‌రు చెబితే రాదు. త‌మంత‌కు తాముగా ఇస్తే వ‌స్తుంది. తాజాగా ప్రిన్స్ మ‌హేష్ బాబు కూతురు సితార హాట్ టాపిక్ గా మారారు.

ఇప్ప‌టికే చిన్నారులకు గుండెకు సంబంధించిన శ‌స్త్ర చికిత్స‌లు చేయించ‌డంలో ముందంజ‌లో ఉన్నారు న‌టుడు మ‌హేష్ బాబు(Mahesh Babu). ఆయ‌న ఏకైక కూతురు సితార ఈ మ‌ధ్య‌న ఓ సంస్థ‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఎంపికైంది. ఇందులో భాగంగా త‌న‌కు వ‌చ్చిన రెమ్యున‌రేష‌న్ లోంచి ఏకంగా కోటి రూపాయ‌ల‌ను చారిటి సంస్థ‌కు అంద‌జేసింది.

తండ్రికి త‌గ్గ త‌న‌యురాలిగా పేరు తెచ్చుకుంది సితార ఘ‌ట్ట‌మ‌నేని. త‌న‌కు చిన్న‌ప్ప‌టి నుంచి స‌హాయం చేయ‌డ‌మ‌న్నా, ఇందుకు సంబంధించిన కార్య‌క్ర‌మాల‌లో పాల్గొనడం అంటే ఇష్ట‌మ‌ని ఈ సంద‌ర్భంగా చెప్పింది. ఆమె చేసిన సాయం ఎంద‌రికో స్పూర్తి దాయ‌కంగా మారుతుంద‌న‌డంలో సందేహం లేదు.

Also Read : Opposition Parties Comment : విప‌క్షాల కూట‌మి విజృంభిస్తుందా

 

Leave A Reply

Your Email Id will not be published!