YS Sharmila slams KCR : మాట తప్పడంలో కేసీఆర్ దిట్ట – షర్మిల
రైతులను మోసం చేసిన ఘనత సీఎందే
YS Sharmila slams KCR : వైస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. బుధవారం ట్విట్టర్ వేదికగా ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు సీఎం కేసీఆర్ పై, బీఆర్ఎస్ ప్రభుత్వంపై. మోసం చేయడంలో, మాట తప్పడంలో కేసీఆర్ ను మించిన నాయకుడు ఈ దేశంలో లేరంటూ సంచలన ఆరోపణలు చేశారు.
YS Sharmila Slams KCR
రైతులకు సంబంధించిన రుణాలను మాఫీ చేస్తానని గతంలో ప్రకటించారని కానీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. నాలుగేళ్లుగా చెబుతూ వస్తున్నారే తప్ప ఆచరణలో పెట్టలేదన్నారు షర్మిల(YS Sharmila). మాట తప్పం మడమ తిప్పం అంటూ సొల్లు కబుర్లు చెప్పడంలో సీఎం సిద్దహస్తుడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ చెప్పిన మాటలు విన్న రైతులు ఆగమై పోయారని, బ్యాంకుల ముందు దోషులుగా నిలబడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేశారు షర్మిల. దొర మాత్రం ఫామ్ హౌస్ గడప కూడా దాటలేదన్నారు. అన్నం పెట్టే రైతులకు సున్నం పెట్టిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు.
ఇప్పటి దాకా 20 లక్షల రైతుల ఖాతాలను బ్యాంకులు నిలిపి వేశాయని వారి పరిస్థితి దారుణంగా ఉందన్నారు వైఎస్ షర్మిల. ఇప్పటికైనా దొర కళ్లు తెరిచి రైతుల ఇక్కట్లను తొలగించాలని షర్మిల డిమాండ్ చేశారు.
Also Read : Congress Slams : ఇండియా అంటే భయం పట్టుకుందా