Samuthirakani : పవన్ కళ్యాణ్ నేషనల్ లీడర్
నటుడు, దర్శకుడు సముద్రఖని
Samuthirakani : ప్రముఖ నటుడు , తమిళ దర్శకుడు సముద్ర ఖని షాకింగ్ కామెంట్స్ చేశారు . ఆయన జనసేన పార్టీ చీఫ్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఏపీలో రాజకీయలు వేడెక్కిన తరుణంలో సముద్రఖని చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Samuthirakani Words
పవన్ కళ్యాణ్ శక్తివంతమైన నటుడే కాదని అద్భుతమైన విజన్ ఉన్న నాయకుడంటూ కొనియాడారు. అంతే కాదు ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడు కాదని, జాతీయ స్థాయి నేత అంటూ పవన్ కళ్యాణ్ గురించి ప్రశంసలు కురిపించారు.
ఇదిలా ఉండగా సముద్రఖని(Samuthirakani) దర్శకత్వంలో బ్రో ది వారియర్ సినిమా రాబోతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి విడుదల తేదీ కూడా ఖరారు చేశారు. జూలై 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మూమీ మేకర్స్. ఇక సముద్రఖని గురించి ఎంత చెప్పినా తక్కువే. భిన్నమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి. అంతకు మించిన రచయిత కూడా. తనే స్క్రీన్ ప్లే కూడా రాసుకుంటాడు.
బ్రో ది వారియార్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్ దుమ్ము రేపుతోంది. ఇక ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తుండగా సాయి ధరమ్ తేజ్ మరో పాత్రలో లీనమయ్యారు.
Also Read : Lokesh Kanagaraj : త్వరలో లియో సెకండ్ సింగిల్