Ramachandra Guha : మణిపూర్ తగలబడి పోతుంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారనే దానిపై పార్లమెంట్ భగ్గుమంటోంది. 26 పార్టీలకు చెందిన ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ భవనం ముందు దీక్షకు దిగారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నిప్పులు చెరగడంతో సహనం కోల్పోయారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖర్. పార్లమెంట్ సమావేశాలు ముగిసేంత వరకు ఎంపీ సంజయ్ సింగ్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Ramachandra Guha Asking
దీనిపై పెద్ద ఎత్తున విపక్షాల ఎంపీలు మండిపడ్డారు. ఈ తరుణంలో దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఇదిలా ఉండగా ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ(Ramachandra Guha) సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీపై. మణిపూర్ ఓ వైపు మండుతోంది. ఇప్పటికే వందలాది మంది చని పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఓ వర్గం పని గట్టుకుని దాడులకు తెగబడుతోంది. కేంద్రంలో , రాష్ట్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ పూర్తిగా నియంత్రించడంలో విఫలమైందని ఆరోపించారు రామచంద్ర గుహ.
ఒక రకంగా చూస్తే నరేంద్ర మోదీ మణిపూర్ ను చూస్తే భయాందోళనకు గురవుతున్నట్లు తోస్తోందన్నారు. వెంటనే బేషరతుగా జాతికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాను ఇన్నేళ్ల కాలంలో ఇలాంటి బాధ్యతా రాహిత్యంతో ఉన్న ప్రధానిని చూడలేదన్నారు రామచంద్ర గుహ.
Also Read : Prakasham Barrage : ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి