Kapil Dev : ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌న‌దే – క‌పిల్

మ‌న జ‌ట్టు హాట్ ఫెవ‌రేట్

Kapil Dev : ఈ ఏడాది ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆతిథ్యం ఇస్తోంది. ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్ వ‌చ్చేసింది. దాయాది దేశాలు భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ లు జ‌ర‌గ‌నున్నాయి. ఈసారి ఏ జ‌ట్టు ట్రోఫీని గెలుచుకుంటుంద‌నే దానిపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

Kapil Dev Words

మొత్తంగా వ‌ర‌ల్డ్ క‌ప్ లో రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు ట్రోఫీని కైవ‌సం చేసుకునేందుకు ఎక్కువ‌గా ఛాన్స్ ఉంద‌ని జోష్యం చెప్పారు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ , హ‌ర్యానా హ‌రి కేన్ క‌పిల్ దేవ్(Kapil Dev) నిఖంజ్. ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడారు.

భార‌త జ‌ట్టు ఎంపిక బాగుంద‌ని, క‌ప్పు గెలుచుకునే స‌త్తా మ‌న‌కే ఉంద‌న్నారు. అయితే క‌లిసిక‌ట్టుగా ఆడాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అలా అయితేనే స‌క్సెస్ అవుతామ‌ని ఏ మాత్రం ఏమ‌రుపాటుగా ఉన్నా ఇత‌ర జ‌ట్లు మ‌న జ‌ట్టును బోల్తా కొట్టిస్తాయ‌ని హెచ్చ‌రించారు క‌పిల్ దేవ్ నిఖంజ్.

అయితే మ‌న జ‌ట్టు ఆట‌గాళ్లు తీవ్ర ఒత్తిడికి లోన‌వుతున్నార‌ని, అస‌లైన స‌మ‌యంలో వికెట్ల‌ను పారేసుకుంటున్నార‌ని దీనిని అధిగ‌మిస్తేనే జ‌ట్టు మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేసేందుకు వీలు క‌లుగుతుంద‌న్నారు. ఇదిలా ఉండ‌గా దేశానికి తొలిసారి క‌పిల్ దేవ్ సార‌థ్యంలో 1983లో వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ సాధించింది.

Also Read : Ramachandra Guha : మ‌ణిపూర్ పై మోదీ మౌనమేల‌

 

Leave A Reply

Your Email Id will not be published!