Mahesh babu 24 Years : ప్రిన్స్ కెరీర్ కు 24 ఏళ్లు
కంగ్రాట్స్ తెలిపిన త్రివిక్రమ్
Mahesh babu 24 Years : అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు పొందిన ఏకైక తెలుగు నటుడు మహేష్ బాబు ఇవాల్టితో తన కెరీర్ లో అరుదైన మైలు రాయిని చేరుకున్నారు. తను సినీ రంగంలోకి అడుగు పెట్టి 24 ఏళ్లయింది. ఆయన పూర్తి పేరు ఘట్టమనేని మహేశ్ బాబు. ఆగస్టు 9, 1975లో పుట్టాడు. ఆయనకు ప్రిన్స్ , సూపర్ స్టార్ అన్ని పేర్లు కూడా ఉన్నాయి. తన భార్య నమ్రత ఒకప్పుడు హీరోయిన్. ఆయనకు ఇద్దరు పిల్లలు. సితార, గౌతమ్ కృష్ణ.
Mahesh babu 24 Years Journey
ఆయన వయస్సు 47 ఏళ్లు. చెన్నైలో చదువుకున్నారు. 1979 నుంచి 1990లో బాల నటుడిగా ప్రవేశించాడు. ఆయన తండ్రి కృష్ణ ఇటీవలే కన్నుమూశారు. కెరీర్ పరంగా బాల నటుడిగా ఎనిమిది సినిమాలలో నటించారు. తొలి సినిమా రాజ కుమారుడు తో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు మహేష్ బాబు(Mahesh babu). నిజం, దూకుడు, అతడు, శ్రీమంతుడు సినిమాలు తన కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం తనకు గొప్ప సంతృప్తిని ఇచ్చింది.
మహేష్ బాబు కెరీర్ లో మలుపు తిప్పిన ఏకైక సినిమా అతడు. దీనికి అన్నీ తానై వ్యవహరించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మహేష్ ను మాస్ హీరోగా నిలబెట్టింది. దర్శకుడు దాసరి నారాయణ రావు తీసిన నీడ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. 2001లో కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన మురారీ బిగ్ హిట్ గా నిలిచింది. 2003లో గుణశేఖర్ తీసిన ఒక్కడు చిత్రం ప్రిన్స్ కు సూపర్ సక్సెస్ ఇచ్చింది. పూరీ జగన్నాథ్ తీసిన పోకిరి తెలుగు సినీ చరిత్రలో బాక్సులు బద్దలు కొట్టింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారంలో నటిస్తున్నాడు.
Also Read : BRO Movie Collections : పవన్ కళ్యాణ్ బ్రో కలెక్షన్ల సునామీ రూ. 55.02