Payam Meenaiah : వరదల దెబ్బకు ములుగు, భూపాలపల్లి, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాలు పెద్ద ఎత్తున నష్ట పోయాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చోటు చేసుకుంది. చాలా మంది గల్లంతయ్యారు. మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ తరుణంలో ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శించారు ములుగు జిల్లాకు చెందిన టీచర్ పాయం మీనయ్య .
Payam Meenaiah saved 40 children’s lives:
వరద ఉధృతి పెరుగుతుండడంతో ప్రమాదాన్ని ముందే పసిగట్టాడు ఈ టీచర్. ఆయన గిరిజన ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్నారు. కొండాయి గ్రామానికి నీరు చేరుకునే లోపు ఆశ్రమ బడిలో చదువుకుంటున్న 40 మంది విద్యార్థులను తరలించాడు. ప్రాణాలు పోకుండా కాపాడాడు పాయం మీనయ్య. అసాధారణమైన ధైర్యం, అంకిత భావంతో పని చేశారు ఈ టీచర్.
జంపన్న వాగు ఉధృతంగా ప్రవహించాన్ని దగ్గరుండి చూశాడు. ఇలాగే ఉంటే తనతో పాటు పిల్లలు కూడా ప్రాణాలు పోవడం ఖాయమని గ్రహించాడు. ఆ వెంటనే పిల్లలందరినీ బడి నుంచి తరలించాడు. తన ఇంటికి తీసుకు వెళ్లాడు. అక్కడ వారందరికీ భోజన, వసతి సౌకర్యాలు కల్పించాడు పాయం మీనయ్య. విషయం తెలుసుకున్న మంత్రులు కేటీఆర్(KTR), సత్యవతి రాథోడ్ టీచర్ ను అభినందించారు. జిల్లా కలెక్టర్ కు పిల్లల బాగోగులు చూడాలని ఆదేశించారు. ఇలాంటి వాళ్లు ఉండడం తమకు గర్వ కారణంగా ఉందన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.
Also Read: Director Shankar : 30 ఏళ్లు పూర్తి చేసుకున్న శంకర్