MP Sanjay Singh : ఆర్డినెన్స్ బిల్లు వీగి పోవ‌డం ఖాయం

ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్ కామెంట్స్

MP Sanjay Singh : ఢిల్లీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మోదీ కొలువుతీరిన బీజేపీ ప్ర‌భుత్వం ఆర్డినెన్స్ బిల్లును ప్ర‌వేశ పెడుతోంది. దీనిని తాము ముందు నుంచీ వ్య‌తిరేకిస్తూ వ‌చ్చాం. తాను కేవ‌లం ప్ర‌శ్నించినందుకే త‌న‌ను రాజ్య‌స‌భ నుంచి స‌స్పెండ్ చేశారంటూ మండిప‌డ్డారు ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్(MP Sanjay Singh). ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడారు. 1993-1998 మధ్య భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం ఉంది. అప్ప‌టి సీఎం సాహిబ్ సింగ్ వ‌ర్మ అసెంబ్లీలో ఓ ప్ర‌క‌ట‌న చేశారు.

MP Sanjay Singh Comments

అదేమిటంటే ఢిల్లీకి సీఎం కావ‌డం కంటే పొలంలో పార‌తో కూలీ ప‌ని చేయ‌డం చాలా ఉత్త‌మ‌మ‌ని స‌భ సాక్షిగా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇవాళ అదే పార్టీకి చెందిన మోదీ స‌ర్కార్ చేస్తోందంటూ మండిప‌డ్డారు. ఇది ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాద‌న్నారు. ఎందుకంటే పార్ల‌మెంట్ అంటే లోక్ స‌భ , రాజ్య స‌భ‌. బీజేపీ, ఎన్డీఏ స‌ర్కార్ కు బ‌ల‌మైన మెజారిటీ కేవ‌లం లోక్ స‌భ‌లో మాత్ర‌మే ఉంద‌న్నారు.

కానీ రాజ్య‌స‌భ‌లో లేదు. అయినా న‌యానో భ‌యానో వైసీపీని, బిజూ జ‌న‌తా ద‌ళ్ ను ఒప్పించారు. వారిద్ద‌రూ కేంద్రానికి బేష‌ర‌తు మ‌ద్ద‌తు తెలిపినా తమ‌కు ఒరేగిది ఏమీ ఉండ‌ద‌న్నారు సంజ‌య్ సింగ్. ఎందుకంటే బిల్లును స‌భ‌లో ప్ర‌వేశ పెట్ట‌గ‌ల‌రే త‌ప్పా రాజ్యాంగాన్ని మార్చ‌లేర‌న్న సంగ‌తి తెలుసు కోవాల‌న్నారు.

Also Read : Jayasudha Confirm : జ‌య‌సుధ‌కు సీటు క‌న్ ఫ‌ర్మ్

Leave A Reply

Your Email Id will not be published!