MLA Seethakka : పాటలు కావవి తూటాలు – సీతక్క
పేద వర్గాలకు తీరని నష్టం
MLA Seethakka : గద్దర్ లేక పోవడం అన్నది ఇప్పటికీ జీర్ణించు కోలేక పోతున్నానని ములుగు ఎమ్మెల్యే దాసరి సీతక్క(MLA Seethakka) అన్నారు. ఆయన పాటలు దట్టించిన తూటాలు అని పేర్కొన్నారు. ఇది తీరని విషాదం. ఆయన లేరన్న వార్తను తాను జీర్ణించు కోలేక పోతున్నానని వాపోయారు సీతక్క.
MLA Seethakka Tributes to Gaddar
గద్దర్ లేక పోవడం పీడితులకు, బాధితులకు, అణగారిన వర్గాలకు అండగా ఉంటూ వచ్చిన అరుదైన గొంతుక ఆగి పోవడం నిజంగా పూడ్చని విషాదంగా వాపోయారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా విషాదం అలుము కుందన్నారు.
ప్రతి పాట ప్రజల కోసం పాడాడని, కవిగా, రచయితగా, గాయకుడిగా కొన్నేళ్లుగా తన జీవితాన్ని పాట కోసం అంకితం చేసిన మహనీయుడు, మహా గాయకుడు గద్దరన్న అని అన్నారు సీతక్క. వేలాది పాటలు కోట్లాది మందిని ప్రభావితం చేసిన ప్రజా గాయకుడు అని కొనియాడారు.
అమ్మా తెలంగాణమా అంటూ ఆయన పాడిన పాటలు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశాయన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశాయని ప్రశంసించారు ఎమ్మెల్యే సీతక్క.
Also Read : Revanth Reddy Gaddar : గద్దర్ మరణం తెలంగాణకు నష్టం