Rahul Gandhi Gaddar : గద్దర్ మరణం విషాదం – రాహుల్ గాంధీ
ఆత్మీయుడిని కోల్పోయానన్న అగ్ర నేత
Rahul Gandhi Gaddar : యావత్ దేశం గర్వించ దగిన గొప్ప గాయకుడు గద్దర్ మరణించారన్న వార్తను తాను ఇంకా జీర్ణించుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi). తన ఆట పాటలతో తెలంగాణను, ఏపీని కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేశారని, ఇంకా చేస్తూనే ఉన్నారని కొనియాడారు రాహుల్ గాంధీ.
Rahul Gandhi Gaddar Emotional Words
తనను ఢిల్లీలో కలుసుకున్న సందర్భంలో, ఆ తర్వాత ఖమ్మం వేదికగా జరిగిన జన గర్జన సభలో తనను ఆలింగనం చేసుకున్నారని ఆ సన్నివేశం తనకు ఇంకా గుర్తుకు వస్తూనే ఉన్నదని గుర్తు చేసుకున్నారు రాహుల్ గాంధీ.
ఇప్పటికీ , ఎల్లప్పటికీ తను గాయకుడిగానే కాదు ఆత్మీయుడిగా గుర్తుండి పోతారని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. తమ పార్టీ తరపున ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు ఏఐసీసీ మాజీ చీఫ్. తెలంగాణకే కాదు యావత్ దేశానికి తీరని నష్టంగా పేర్కొన్నారు రాహుల్ గాంధీ.
ఇదిలా ఉండగా గద్దర్ ఇవాళ కన్నుమూశారు. తన ఆట పాటలతో అలరిస్తూ, చైతన్య పరుస్తూ వచ్చిన ప్రజా గాయకుడు ఇక సెలవంటూ వెళ్లి పోయారు. గుండె ఆపరేషన్ కు సహకరించక పోవడంతో డాక్టర్లు మరణించినట్లు ప్రకటించారు.
పాట ఉన్నంత వరకు గద్దర్ బతికే ఉంటారు. ఆయన నిలిచే ఉంటారు. సూర్య చంద్రులు ఉన్నంత కాలం గద్దర్ పాటలు నిలిచే ఉంటాయని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
Also Read : Pawan Kalyan Gaddar : మూగ బోయిన ప్రజా గొంతుక