AP CM YS Jagan : గ‌ద్ద‌ర్ మ‌ర‌ణం ఊహించ‌న‌ది – జ‌గ‌న్

తెలుగు ప్ర‌జ‌ల వంద‌నం

AP CM YS Jagan : ప్ర‌జా గాయ‌కుడు, యుద్ద నౌక గ‌ద్ద‌ర్ ఆక‌స్మిక మృతి ప‌ట్ల తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(AP CM YS Jagan). ఆదివారం విష‌యం తెలిసిన వెంట‌నే కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌ద్ద‌ర్ ప్ర‌జ‌ల క‌వి. బ‌ల‌హీన వ‌ర్గాల‌కు నిత్యం స్పూర్తిగా నిలిచార‌ని కొనియాడారు.

AP CM YS Jagan Tributes to Gaddar

ఆయ‌న జీవిత కాలం అంతా పాట‌లతో ప్ర‌యాణం చేశార‌ని పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం పాటు ప‌డ్డాడ‌ని, త‌న ఆట పాట‌ల‌తో గ‌ళం ఎత్తాడ‌ని కొనియాడారు జ‌గ‌న్. ఆయ‌న మ‌ర‌ణం ఊహించ‌న‌ద‌ని అన్నారు సీఎం. సామాజిక న్యాయ యోధుల ఆలోచ‌న‌లు, మాట‌లు, జీవితాలు ఎప్ప‌టికీ మ‌న‌కు స్పూర్తిని క‌లిగిస్తూనే ఉంటాయ‌ని పేర్కొన్నారు జ‌గ‌న్ రెడ్డి.

తెలుగు ప్ర‌జ‌లంద‌రూ ప్ర‌జా యుద్ద నౌక గ‌ద్ద‌ర్ కు పాదాభి వంద‌నం చేస్తున్నార‌ని తెలిపారు. ఇదిలా ఉండ‌గా గ‌ద్దర్ అస‌లు పేరు గుమ్మ‌డి విఠ‌ల్ రావు. ఆయ‌న స్వ‌స్థలం తూఫ్రాన్. బ్యాంకు ఉద్యోగిగా ప్రారంభించినా త‌ర్వాత ప్ర‌జ‌ల కోసం అడవుల్లోకి వెళ్లాడు. న‌క్స‌లైట్ ఉద్య‌మంలో చురుకుగా పాల్గొన్నారు. జ‌నం కోసం గానం చేశాడు. ప్ర‌జ‌ల ఆర్త నాదాల‌ను వినిపించిన గొప్ప వ్య‌క్తి గ‌ద్ద‌ర్ .

మాజీ సీఎం , టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు సైతం గ‌ద్ద‌ర్ మృతి ప‌ట్ల విచారం వ్య‌క్తం చేశారు. గొప్ప గాయ‌కుడిని కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరారు.

Also Read : Rahul Gandhi Gaddar : గ‌ద్ద‌ర్ మ‌ర‌ణం విషాదం – రాహుల్ గాంధీ

Leave A Reply

Your Email Id will not be published!