Vimalakka : అరుణోదయ సాంస్కృతిక గాయకురాలు విమలక్క(Vimalakka) కన్నీటి పర్యంతం అయ్యారు. గద్దర్ చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. ఈ సందర్బంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా యుద్ద నౌకగా ఇప్పటికీ ఎప్పటికీ ఎల్లప్పటికీ నిలిచచే ఉంటారని అన్నారు విమలక్క. పీడితులకు, బాధితులకు, అణగారిన వర్గాలకు తీరని లోటు అనిపేర్కొన్నారు. సాంస్కృతిక ఉద్యమానికి ఊపిరి పోసిన గొప్ప గాయకుడు గద్దర్.
Vimalakka Tributes to Gaddar
ఆయనతో కలిసి పాటలు పాడిన పాటలు, సందర్భాలు ఎన్నో ఉన్నాయని అన్నారు విమలక్క. ఆయన ముద్ర కలకాలం కాలం ఉన్నంత దాకా నిలిచే ఉంటుందన్నారు. ఇవాళ గద్దరన్న గురించి మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదని వాపోయారు విమలక్క.
ఒకటా రెండా వందలాది పాటలతో, ఆటతో, తన మాటలతో తూటాలను పేల్చిన అరుదైన గాయకుడు గద్దరన్న అని అన్నారు. ఆయన లేని లోటును పూడ్చే గాయనీ గాయకులు ఇప్పట్లో వస్తారని కూడా అనుకోవడం లేదన్నారు. మొత్తంగా యావత్ తెలంగాణ సమాజం కన్నీళ్లతో నిండి పోయింది. 74 ఏళ్ల వయసులో సైతం పాటను పాడుకుంటూనే వచ్చారు గద్దర్.
Also Read : DK Shiva kumar : ప్రజా గాయకుడికి మరణం లేదు – డీకే