Chiranjeevi Gaddar : గద్దరన్నకు లాల్ సలాం – చిరంజీవి
ఆయన మరణం తీరని విషాదం
Chiranjeevi Gaddar : ప్రజా గాయకుడు, ప్రజా యుద్ద నౌక గద్దరన్న మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).ఆదివారం ట్విట్టర్ వేదికగా గద్దర్ ఇక లేరన్న వార్త తనను కలిచి వేసిందన్నారు. ఆయన గళం అజరామరమని పేర్కొన్నారు. ఏ పాట పాడినా , దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడని కొనియాడారు చిరంజీవి. జనం కోసం తన జీవితాన్ని పాటకే అంకితం చేసిన యోధుడు గద్దర్ అని ప్రశంసించారు. ప్రజా యుద్ద నౌక గద్దరన్నకు లాల్ సలాం చేస్తున్నట్లు స్పష్టం చేశారు మెగాస్టార్.
Chiranjeevi Gaddar Emotional Words
అత్యంత సరళంగానే ఉంటూనే అత్యంత ప్రభావంతమైన తన మాటల, పాటలతో దశాబ్దాల పాటు ప్రజల్లో స్పూర్తిని రగిల్చిన ప్రజా గాయక యోధుడు ఇక లేరన్న విషయాన్ని తాను నమ్మలేక పోతున్నానని అన్నారు. ప్రపంచంలో పాట ఉన్నంత వరకు గద్దర్ బతికే ఉంటారని స్పష్టం చేశారు చిరంజీవి.
ప్రజా సాహిత్యంలో, ప్రజా ఉద్యమాలలో గద్దరన్న లేని లోటు ఎప్పటికీ పూడ్చ లేనిదన్నారు మెగాస్టార్ చిరంజీవి. పాట ల్లోనూ , పోరాటంలోనూ ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, లక్షలాది గద్దరన్న అభిమానులకు, శ్రేయోభిలాషులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు చిరంజీవి.
Also Read : Vimalakka : ప్రజా యుద్దనౌకకు పాదాభివందనం