Meher Ramesh : నా కల నెరవేరింది – మెహర్ రమేష్
దూసుకు పోతున్న భోళా శంకర్
Meher Ramesh : ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తను దర్శకత్వం వహించిన మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదట మిశ్రమ స్పందన వచ్చినా తర్వాత సూపర్ సక్సెస్ టాక్ తెచ్చుకుంది. దీంతో దర్శకుడు మెహర్ రమేష్(Meher Ramesh) మోములో నవ్వు మెరిసింది. ఈ సందర్భంగా మెగాస్టార్ గురించి స్పందించారు. తన జీవితంలో దర్శకుడిగా ఎంతో సంతృప్తిని ఇచ్చిన ఏకైక సన్నివేశం భోళా శంకర్ చిత్రం తీయడమేనని పేర్కొన్నారు.
Meher Ramesh Words about Chiranjeevi
నాకు నిత్యం ప్రేరణ, నాకు మార్గదర్శకత్వం వహించిన ఏకైక వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు. అన్నీ తానేనంటూ కితాబు ఇచ్చారు. తనతో సినిమా తీసే అవకాశం ఇచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ఇదిలా ఉండగా భోళా శంకర్(Bhola Shankar) లో మెగాస్టార్ మేనరిజాన్ని ఎలివేట్ చేశాడు దర్శకుడు. చిరంజీవితో పాటు అందాల ముద్దుగుమ్మ తమన్నా భాటియా, కీర్తి సురేష్ నటించారు.
తమిళంలో అజిత్ నటించిన సినిమాను రీమేక్ తీశాడు దర్శకుడు మెహర్ రమేష్. గతంలో డార్లింగ్ ప్రభాస్ తో భిల్లా సినిమా తీశాడు. ప్రస్తుతం భోళా శంకర్ తో మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చాడు.
Also Read : Luna-25 Rocket : జాబిల్లి వద్దకు రష్యా రాకెట్