Gaurav Gogoi Comment : ధిక్కార స్వ‌రం ప్ర‌శ్న‌ల వ‌ర్షం

ఎవ‌రీ గౌర‌వ్ గొగోయ్ ఏమిటా క‌థ

Gaurav Gogoi Comment : నిండు స‌భ‌లో ఓ గొంతుక ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీసింది..నిగ్గ‌దీసి ప్ర‌శ్నించింది. ప్ర‌తిప‌క్షం లేకుండా ప్రజాస్వామ్యం ఉండాల‌ని అనుకోవ‌డం ఎంత మాత్రం మంచిది కాదంటూ హెచ్చ‌రించింది. ఆపై మాట‌ల తూటాలు పేల్చింది. ఒక్కో మాట విల్లంబులా వ‌స్తుంటే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సైతం విస్తు పోయారు. ఇంత‌కీ ఎవ‌రిదీ గొంతుక‌. ఎందుకు అంత‌టి శ‌క్తి ఉంది ఆ వాయిస్ కు. ఇప్ప‌టి దాకా ప్రశ్న‌ల వ‌ర్షం కురిపిస్తూ గుక్క తిప్పుకోకుండా భార‌త దేశపు ఔన్న‌త్యం గురించి, దాని భ‌విష్య‌త్తు గురించి అన‌ర్ఘ‌లంగా ప్ర‌సంగిస్తూ వ‌చ్చిన ఆ గొంతుక ఎవ‌రిదో కాదు అస్సాం కాంగ్రెస్ పార్టీకి చెందిన గౌర‌వ్ గొగోయ్(Gaurav Gogoi) ది. భార‌త్ జోడో యాత్ర‌తో లైమ్ లైట్ లోకి వ‌చ్చిన వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ సైతం ఈ యువ ఎంపీ ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర‌ను చూసి విస్తు పోయారు.

అంత‌లా మెస్మ‌రైజ్ చేస్తూ త‌న‌ను తాను ఉత్త‌మ పార్ల‌మెంటేరియ‌న్ గా ప్రూవ్ చేసుకున్నారు. సోది లేకుండా సూటిగా ప్రజా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌తిసారీ ప్ర‌స్తావిస్తూ వ‌చ్చారు. నా ప్ర‌జ‌లు న‌న్ను మౌనంగా కూర్చోమ‌ని ఇక్క‌డికి పంపించ‌లేదు అధ్యక్షా. స‌మ‌స్త జ‌నం హాహాకారాల‌తో, ఆక‌లి కేక‌ల‌తో అల‌మిటిస్తుంటే , స‌వాల‌క్ష స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతుంటే నేను ప్ర‌శ్నించ‌కుండా ఎలా ఉండ‌గ‌ల‌నని అనుకుంటున్నారంటూ నిప్పులు చెరిగారు గౌర‌వ్ గొగోయ్.

Gaurav Gogoi Comment Viral

ఇంత‌కీ గొగోయ్(Gogoi) వ‌య‌స్సు ప‌ట్టుమ‌ని 40 ఏళ్లు . ఇంద్ర‌ప్ర‌స్త యూనివ‌ర్శిటీతో పాటు న్యూయార్క్ విశ్వ విద్యాల‌యంలో చ‌దువుకున్నాడు. అంతే కాదు సామాజిక కార్య‌క‌ర్త‌గా త‌న జీవితాన్ని ప్రారంభించారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డంలో ఉన్నంత తృప్తి ఇంకెందులో ఉండ‌దంటాడు గౌర‌వ్ గొగోయ్. 2020 నుండి లోక్ స‌భ‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. మాజీ సీఎం త‌రుణ్ గొగోయ్(Gogoi) త‌న‌యుడు. 2005లో ప్ర‌వా అనే స్వ‌చ్చంధ సంస్థ‌లో ప‌ని చేశాడు. అంత‌కు ముందు ఎయిర్ టెల్ లో భారీ జీతాన్ని వ‌దులుకున్నాడు. యుకెకు చెందిన ఎలిజ‌బెత్ కోల్ బ‌ర్న్ ను పెళ్లి చేసుకున్నాడు. 2014లో క‌లియాబోర్ నుంచి బ‌రిలో నిలిచాడు. 93 వేల ఓట్ల‌తో గెలుపొందాడు. అంతే కాదు రాజ‌స్థాన్ లో కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ క‌మిటీకి గౌర‌వ్ గొగోయ్ నాయ‌క‌త్వం వ‌హించారు. మోదీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా గొగోయ్ అవిశ్వాస తీర్మానానికి నాయ‌క‌త్వం వ‌హించారు.

ఈ సంద‌ర్బంగా మోదీని, బీజేపీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. 90 రోజులైనా మోదీ ఎందుకు మ‌ణిపూర్ ను సంద‌ర్శించ లేద‌ని ప్ర‌శ్నించాడు. ఓ వైపు మ‌ణిపూర్ కాలిపోతుంటే దేశం కూడా కాలి పోతున్న‌ట్టేన‌ని ఇక‌నైనా బాధ్య‌త వ‌హించాల‌ని స్ప‌ష్టం చేశాడు గౌర‌వ్ గొగోయ్(Gaurav Gogoi). అస్సాం మాత్ర‌మే కాదు ఈ దేశంలో ఉన్న ప్ర‌జ‌లంద‌రికీ స‌మాన అవ‌కాశాలు అందాల్సిన అవ‌స‌రం ఉంది. ఏ ఒక్క‌రు కులం పేరుతో, మ‌తం పేరుతో, ప్రాంతం పేరుతో, విద్వేషం పేరుతో విడి పోవాల్సిన అవ‌స‌రం లేదు. ఒక‌రిపై మ‌రొక‌రు దాడులు చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్పుడు కావాల్సింది మ‌ణిపూర్ కు మాన‌వ‌త్వం కావాలి. కాషాయం కానే కాద‌ని పార్ల‌మెంట్ సాక్షిగా నిన‌దించిన గౌర‌వ్ గొగోయ్ తండ్రికి త‌న‌యుడి అనిపించుకున్నాడు. హ్యాట్సాఫ్ గొగోయ్ కొన్ని గొంతుక‌లు ఎల్లప్పుడూ ప్ర‌శ్నిస్తూనే ఉంటాయి. నిల‌దీస్తూనే ఉంటాయి. ఎన్న‌డూ త‌ల‌వంచ‌వు అవి. ఆత్మ గౌర‌వానికి ప్ర‌తీక‌లు ప్ర‌శ్న‌లు. వాటిని దేనితోనూ పోల్చ‌లేం..కాసుల‌తో కొన‌లేం. అలాంటి గొంతుక గౌర‌వ్ గొగోయ్ ది.

Also Read : Meher Ramesh : నా క‌ల నెర‌వేరింది – మెహ‌ర్ ర‌మేష్

Leave A Reply

Your Email Id will not be published!