Gouthu Sirisha : జగన్ చెప్పేవన్నీ అబద్దాలు – గౌతు శిరీష
టీడీపీ ప్రధాన కార్యదర్శి షాకింగ్ కామెంట్స్
Gouthu Sirisha : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష షాకింగ్ కామెంట్స్ చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఆయన చెప్పేవన్నీ అబద్దాలంటూ ధ్వజమెత్తారు. ఆయన మాటలు కొండంత చేతలు గోరంత మాత్రమేనని ఎద్దేవా చేశారు గౌతు శిరీష. డ్వాక్రా సున్నా వడ్డీ రాయితీ రూ. 3 లక్షలకు కుదించిన ఘనత జగన్ దేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Gouthu Sirisha Slams YS Jagan
ఇదే మహిళా గ్రూపులకు చంద్రబాబు నాయుడు రూ. 5 లక్షల వరకు సున్నా వడ్డీ రాయితీ వర్తింప చేశారని పేర్కొన్నారు. ఇక వడ్డీ రాయితీని రూ. 10 లక్షల దాకా వర్తింప చేస్తానని మేనిఫెస్టో, ఎన్నికల ప్రచారంలో మాయ మాటలు చెప్పి జగన్ మోసం చేశాడని ఆరోపించారు గౌతు శిరీష.
ఏపీ సీఎం చేసిన మోసం వల్ల పొదుపు మహిళలకు లబ్ది మాట దేవుడెరుగు ఏకంగా రూ. 30 వేలకు తగ్గి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఆచరణలో మాట మార్చాడని ఆరోపించారు గౌతు శిరీష(Gouthu Sirisha). అంతే కాకుండా చేయూత పథకంతో జగన్ రెడ్డి చేతి వాటం ప్రదర్శించాడని ధ్వజమెత్తారు.
మిగతా 85 లక్షల మంది సంగతి ఏంటి అని ప్రశ్నించారు. నాలుగేళ్ల కాలంలో డ్వాక్రా సొమ్మును కాజేశాడని, అభయ హస్తం కింద రూ. 2,110 కోట్లు దారి మళ్లించారంటూ మండిపడ్డారు.
Also Read : Sri krishnajyothi Swaroopanda Swami Ji : యాగం జీవన యోగం