Satyavathi Rathod : నాగ జ్యోతికి స‌త్య‌వ‌తి న‌జ‌రానా

ఎన్నిక‌ల కోసం నెల వేత‌నం విరాళం

Satyavathi Rathod : కేసీఆర్ తాజాగా ప్ర‌క‌టించిన బీఆర్ఎస్ లిస్టులో ములుగు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నాగ జ్యోతిని ప్ర‌క‌టించారు. దీంతో ఆమె ఒక్క‌సారిగా హాట్ టాపిక్ గా మారారు. కార‌ణం ఆమె తండ్రి మాజీ న‌క్స‌లైట్. పోలీసుల ఎన్ కౌంట‌ర్ లో హ‌త‌మ‌య్యాడు.

ప్ర‌స్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి చెందిన దాస‌రి సీత‌క్క ఉన్నారు. ఆమెకు పోటీగా నాగ జ్యోతిని తీసుకు వ‌చ్చారు సీఎం కేసీఆర్. ఈ సంద‌ర్బంగా ఆమె క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు హ‌ల్ చ‌ల్ చేశాయి.

Satyavathi Rathod Congratulates Naga Jyothi

దీంతో మ‌ర్యాద పూర్వ‌కంగా బుధ‌వారం నాగ జ్యోతి మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్(Satyavathi Rathod) ను ఆమె నివాసంలో క‌లుసుకున్నారు. త‌న ఇంటికి వ‌చ్చిన ఆమెను స‌న్మానించారు. అంతే కాదు నాగ జ్యోతి విస్తు పోయేలా ఏకంగా మంత్రి త‌న నెల వేత‌నం డ‌బ్బుల‌ను విరాళంగా ఇచ్చారు.

నాగ జ్యోతి గెల‌వాల‌ని కోరుతూ రూ. 3,50,000 రూపాయ‌ల చెక్కును ప్రోత్సాహ‌కంగా అంద‌జేశారు స‌త్య వ‌తి రాథోడ్. ఇదే స‌మ‌యంలో రెడ్కో చైర్మ‌న్ వై. స‌తీష్ రెడ్డి సైతం త‌న నెల జీతాన్ని ల‌క్షా యాభై వేలు చెక్కును నాగ జ్యోతికి అంద‌జేశారు.

అంతే కాదు నూత‌న వ‌స్త్రాల‌ను కూడా అంద‌జేశారు నాగ జ్యోతికి.

Also Read : Naga Jyothy VS Seethakka : ర‌స‌వ‌త్త‌ర పోరుకు ములుగు రెడీ

Leave A Reply

Your Email Id will not be published!