Chandrababu Naidu : వైసీపీ పతనం ప్రారంభం – చంద్రబాబు
ప్రజా వేదిక పేరుతో పాదయాత్రలు చేపట్టాలి
Chandrababu Naidu : టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా వేదిక పేరుతో నేతలు పాదయాత్రలు చేపట్టాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ప్రజల్లోకి బలంగా వెళ్లాలని స్పష్టం చేశారు.
Chandrababu Naidu Slams YSRCP
నాలుగున్నర ఏళ్ల కాలంలో ఏం నష్ట పోయామో ప్రజలకు చెప్పాలన్నారు నారా చంద్రబాబు నాయుడు. జగన్ పని అయి పోయిందన్నారు. రాష్ట్రంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 3 ఎమ్మెల్సీ లు గెలిచామని స్పష్టం చేశారు.
మన ఎమ్మెల్యేలను లాక్కున్నా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించు కోగలిగామని చెప్పారు. దేవుడు స్క్రిప్టు తిరగ రాశాడని, అదే వైసీపీ పతనం తప్పదన్నారు. సర్పంచ్ ఎన్నికల్లోనూ చాలా చోట్ల గెలిచామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ ఓట్లు మనకే పడ్డాయని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
రాబోయే శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కావడం ఖాయమని జోష్యం చెప్పారు. జగన్ రాష్ట్రాన్ని అందినంత మేర దోచుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో ప్రజల ఆదాయం పెరగలేదన్నారు. జగన్ ను జనం భరించ లేక పోతున్నారని పేర్కొన్నారు.
మార్పు కోరుకుంటున్నారని, రెడ్డిని ఇంటికి పంపించడం ఖాయమన్నారు చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu). సర్వేలన్నీ టీడీపీ గెలుస్తుందని సూచిస్తున్నాయని తెలిపారు. నేరస్తులకు తమ పార్టీలో చోటు ఉండదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రా రెడ్డికి టీటీడీ బోర్డులో ఎలా స్థానం కల్పిస్తారంటూ ప్రశ్నించారు.
Also Read : PM Modi : మహిళా సైంటిస్టులకు సలాం