PM Modi : మ‌హిళా సైంటిస్టుల‌కు స‌లాం

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ

PM Modi : ఇస్రో సాధించిన విజ‌యం అపూర్వ‌మైన‌ద‌ని పేర్కొన్నారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. ఆయ‌న విదేశీ ప‌ర్య‌ట‌న ముగించుకుని వ‌చ్చిన వెంట‌నే బెంగ‌ళూరుకు వెళ్లారు. అక్క‌డ భార‌తీయ అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ (ఇస్రో) కార్యాల‌యానికి చేరుకున్నారు.

అంత‌కు ముందు ప్ర‌ధాన మంత్రికి భారీ ఎత్తున ఆద‌ర‌ణ ల‌భించింది. దారి పొడ‌వునా భార‌త జాతీయ ప‌తాకాల‌తో ఆయ‌న‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్బంగా ఇస్రో ను సంద‌ర్శించిన వెంట‌నే అక్క‌డ అంతా లేచి నిల్చున్నారు. న‌రేంద్ర మోదీకి గ్రాండ్ వెల్ క‌మ్ చెప్పారు.

PM Modi Praises Female Scientists

ఈ సంద‌ర్బంగా మ‌హిళా సైంటిస్టుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. వారికి తాను స‌లాం చేస్తున్నాన‌ని చెప్పారు ప్ర‌ధాన‌మంత్రి(PM Modi). ఆగ‌స్టు 23న యావ‌త్ ప్ర‌పంచం విస్తు పోయేలా భార‌త దేశం స‌రికొత్త చ‌రిత్ర‌ను సృష్టించింద‌న్నారు. శాస్త్ర‌, సాంకేతిక‌, వైజ్ఞానిక రంగాల‌లో ఇండియా ఇప్పుడు సూప‌ర్ ప‌వ‌ర్ స్టేజికి చేరుకుంద‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి.

చంద్ర‌యాన్ -3 చంద్రుడి వ‌ద్ద‌కు చేరుకుంద‌న్నారు. ద‌క్షిణ ధ్రువానికి చేరుకున్న ఏకైక దేశంగా భార‌త్ నిలిచింద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం చైనా, ర‌ష్యా, అమెరికా మాత్ర‌మే ఉన్నాయ‌ని కానీ ఇప్పుడు ఆ దేశాల స‌ర‌స‌న మ‌నం కూడా చేరామ‌ని అన్నారు. దీనికి కార‌ణం మీరేన‌ని, మీ కృషి వ‌ల్ల‌నే మ‌నం ఈ స్థాయిలో నిలిచామ‌న్నారు మోదీ.

Also Read : R Praggnanadhaa : మ‌ద్ద‌తుగా నిలిచినందుకు థ్యాంక్స్

Leave A Reply

Your Email Id will not be published!