R Praggnanadhaa : మ‌ద్ద‌తుగా నిలిచినందుకు థ్యాంక్స్

వ‌ర‌ల్డ్ చెస్ ఛాంపియ‌న్ షిప్ రన్న‌ర్

R Praggnanadhaa : త‌మిళ‌నాడులోని చెన్నైకి చెందిన గ్రాండ్ మాస్ట‌ర్ ఆర్. ప్ర‌జ్ఞానంద వ‌ర‌ల్డ్ చెస్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్ లో ర‌న్న‌ర‌ప్ గా నిలిచాడు. భార‌త దేశ చెస్ క్రీడా చ‌రిత్ర‌లో అత్యంత పిన్న వ‌య‌స్సు క‌లిగిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు.

R Praggnanadhaa Great Player

ఈ సంద‌ర్భంగా త‌న‌కు బ‌హూక‌రించిన మెడ‌ల్ (ప‌త‌కం)తో మెరిశాడు. త‌న త‌ల్లితో క‌లిసి పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటో వైర‌ల్ గా మారింది నెట్టింట్లో. ఈ సంద‌ర్బంగా భార‌త దేశానికి చెందిన ప్ర‌ముఖులు ఆర్. ప్ర‌జ్ఞానందను(R Praggnanadhaa) అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు.

ప్ర‌ముఖ భార‌తీయ వ్యాపార‌వేత్త ఆనంద్ మ‌హీంద్రా ప్ర‌శంస‌లు కురిపించాడు. ఫైన‌ల్ పోటీలో క‌న‌బ‌ర్చిన ప్ర‌తిభ గొప్ప‌ద‌న్నారు. అంతే కాదు ర‌న్న‌ర‌ప్ గా ఉన్నా అస‌లైన విజేత ఆర్. ప్ర‌జ్ఞానంద అని పేర్కొ్న‌న్నారు. ఇదిలా ఉండ‌గా దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సైతం చెస్ ర‌న్న‌ర‌ప్ ను ప్ర‌శంసించారు.

నీవు సాధించిన ఈ విజ‌యం మామూలు విష‌యం కాద‌న్నారు. దేశ యువ‌త‌కు నీవు ఎల్ల‌ప్ప‌టికీ స్పూర్తి దాయ‌కంగా ఉంటాయ‌ని పేర్కొన్నారు యూపీ. ఇదిలా ఉండ‌గా కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించారు. ప్ర‌భుత్వం త‌ర‌పున ప్ర‌జ్ఞానంద‌కు స‌హ‌కారం అంద‌జేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. కాగా త‌ను గెల‌వాల‌ని కోరిన వారికి, త‌న‌కు మ‌ద్ద‌తు తెలిపిన ప్ర‌తి ఒక్క‌రికీ తాను కృత‌జ్ఞ‌త‌లు తెలియ చేస్తున్నాన‌ని ఆర్. ప్ర‌జ్ఞానంద పేర్కొన్నారు.

Also Read : MLC Kavitha : కామారెడ్డిలో కేసీఆర్ కు బ్ర‌హ్మ‌ర‌థం

Leave A Reply

Your Email Id will not be published!