Bhatti Vikramarka : పేదల పొట్ట కొట్టిన కేసీఆర్
నిప్పులు చెరిగిన భట్టి విక్రమార్క
Bhatti Vikramarka : దళితులకు మూడు ఎకరాలు ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ దారుణంగా మోసం చేశాడంటూ సంచలన ఆరోపణలు చేశారు సీఎల్పీ నేత , మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా గర్జన సభను ఏర్పాటు చేశారు.
Bhatti Vikramarka Asking KCR
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. ఈ సందర్బంగా పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించింది. భారీ ఎత్తున హామీలు ఇచ్చింది. పలు పథకాలను కూడా ప్రవేశ పెడుతున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో పాలన పడకేసిందని ధ్వజమెత్తారు. ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ ప్రజలను మోసం చేయడంలో సక్సెస్ అయ్యారంటూ ఆరోపించారు మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka). సంక్షేమ పథకాల పేరుతో కాలయాపన చేయడం, ఓట్లను కొల్లగొట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు.
రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లు వేయడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని , రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Also Read : MLA Seethakka : బడా బాబులకే రైతు బంధు – సీతక్క