MLA Lakshma Reddy : స్వామి ఆశీర్వాదం కొండంత బలం
ఆశీస్సులు తీసుకున్నమాజీ మంత్రి
MLA Lakshma Reddy : శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో జడ్చర్ల పట్టణంలో నిర్వహించిన అతిరుద్రం చండీయాగంలో పాల్గొన్నారు మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి(MLA Lakshma Reddy). ఆయన కుటుంబీకులు యాగం చేపట్టారు.
MLA Lakshma Reddy in Chandi Yagam
ఈ సందర్భంగా శ్రీ స్వరూపానంద స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. లోక కళ్యాణం కోసం 80వ శాంతి మహా యాగాన్ని చేపట్టడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జడ్చర్లలో ఇలాంటి మహత్తర కార్యక్రమం జరగడం సంతోషం కలిగించిందన్నారు.
స్వామి వారి కృప, ఆశీస్సులతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారని తాను కూడా ఆశ్చర్య పోయానని పేర్కొన్నారు. సత్ సంకల్పంతో స్వామి వారి ఆశీర్వాదం భక్తులకు , తనకు కొండంత బలాన్ని ఇచ్చిందని అన్నారు మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి.
లోక కళ్యాణం కోసం ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో బాగుండాలని చేసిన ఈ యాగం నిర్వహించినందుకు శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీకి కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నానని తెలిపారు.
6) స్వామీ స్మరామీ
Also Read : Chandi Yagam Athirudram : నేటితో అతిరుద్రం పరిపూర్ణం