SRI SRI SRI Swaroopanada Swamy : స్వామీ స్మ‌రామీ

శ్రీ‌శ్రీ‌శ్రీ కృష్ణ‌జ్యోతి స్వ‌రూపానంద స్వామీజీ

SRI SRI SRI Swaroopanada Swamy : జీవితానికి సార్థ‌క‌త చేకూరాలంటే కాస్తంత మ‌న‌శ్శాంతి కావాలి. చుట్టూ స‌మూహంలో మ‌మేక‌మై పోయిన‌ప్పుడు మ‌న‌సు అల్ల‌క‌ల్లోలం అవుతుంది. కానీ సంక‌ల్పం మంచిదైతే, అది లోక క‌ళ్యాణానికి సంబంధించిన‌ది అయితే ఇక ఆనందం మీ స్వంతం అవుతుంది.

భ‌క్తి ఒక‌రు చెబితే రాదు. మ‌నం ద‌గ్గ‌రుండి నేర్చుకోవాలి. అది సాద‌న వ‌ల్ల అల‌వ‌డుతుంది. దీనిని క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తూనే ఉండాలి. దీనికి ఎలాంటి ఖ‌ర్చు ఉండ‌దు. కావాల్సింద‌ల్లా చేయాల‌న్న త‌ప‌న‌. ఎక్క‌డికో ఆనందం కోసం వెతుకుతూ ఉంటాం. మాన‌వ నైజ‌మే అంత‌. కానీ మ‌న‌లోనే ఆ సంతోషం దాగి ఉంద‌ని తెలుసుకోం.

SRI SRI SRI Swaroopanada Swamy Chandi Yagam Completed

దీనికి ప్ర‌ధాన కార‌ణం ప‌రుల‌ను నిందించ‌డం, అన‌వ‌స‌ర విష‌యాల ప‌ట్ల ఎరుక క‌లిగి ఉండటం. దీని వ‌ల్ల అస‌లైన దృష్టి మారి పోతుంది. ప‌క్క చూపులు చూసేందుకు వెంప‌ర్లాడుతుంది. వ‌స్తు వ్యామోహం ఇప్పుడు మ‌నుషుల్ని ఓ ప‌ట్టాన ఉండ‌నీయ‌డం లేదు. కానీ వీట‌న్నింటి నుంచి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకునేందుకు ఏకైక సాధ‌నం ఉంది.

అందే ధ్యానం. ఏకాగ్ర‌త‌తో చేస్తే ఏదైనా సాధ్య‌మ‌వుతుంది. అసాధ్య‌మ‌న్న‌ది మ‌రింత సులువుగా మారి పోతుంది. ఎంత‌గా కోరుకుంటామో అంత‌గా మ‌న నుంచి మ‌నం వేరై పోతాం. దీని వ‌ల్ల అశాంతి, కోపం, ప‌ర దూష‌ణ‌, ప‌ర నింద‌, అకార‌ణ ఆవేశం క‌లుగుతుంది. ఇవ‌న్నీ కావాల‌ని కోరి తెచ్చుకుంటున్నాం.

యాంత్రిక‌మై పోయిన ఈ ప్ర‌స్తుత ప్ర‌పంచంలో ఎవ‌రికి వారు త‌మ‌కు తాముగా ప‌రుగులు తీస్తున్నారు. కానీ ఏం కోల్పోతున్నామో తెలుసు కోలేక పోతున్నారు. ఇది త‌రిచి చూస్తే తెలుస్తుంది. ప్ర‌తి ఒక్క‌రికీ ఆత్మ అనేది హెచ్చ‌రిస్తూనే ఉంటుంది. అనుకున్న దానిని సాధించేందుకు ప్ర‌య‌త్నించడంలో త‌ప్పు లేదు.

కానీ శ్రీ‌కృష్ణ భ‌గ‌వానుడు చెప్పింది ఒక్క‌టే. నీ ప‌ని నువ్వు చేయి. అది త్రిక‌ర‌ణ శుద్దితో చేయి. ఫ‌లితం దానంత‌ట అదే వ‌స్తుంది. నీకు త‌ప్ప‌కుండా ద‌క్కి తీరుతుంది అని. సంక‌ల్పం మంచిదైతే లోకమే నీకు తోడుగా నీతో పాటే ఉంటుంది. ఇది గ‌మ‌నించిన వారికి భ‌విష్య‌త్తు ప‌ట్ల బెంగ ఉండ‌దు. రేపు ఏం జ‌రుగుతుందోన‌న్న ఆందోళ‌న ఉండ‌దు.

శ్రీ‌కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్ అన్న‌ది జీవితంలో భాగం కావాలి. అదే మ‌న‌కు దారి చూపుతుంది. మ‌న‌ల్ని అనుకున్న చోటుకు తీసుకు వెళుతుంది. స‌త్ కార్యం, స‌త్ సంక‌ల్పం, స‌త్ భావ‌న ఇవి మ‌నంద‌రిలో భాగం కావాలి. అప్పుడే జీవితం యోగం అవుతుంది. యాగ ఫ‌లితం ద‌క్కుతుందని సెల‌విస్తున్నారు శ్రీ‌కృష్ణ పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ కృష్ణ జ్యోతి స్వ‌రూపానంద స్వామీజీ(SRI SRI SRI Swaroopanada Swamy).

Also Read : MLA Lakshma Reddy : స్వామి ఆశీర్వాదం కొండంత బ‌లం

Leave A Reply

Your Email Id will not be published!