Pride Of India : ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన దిగ్గజ కంపెనీలలో అత్యధిక కంపెనీలకు భారత దేశానికి చెందిన ప్రవాస భారతీయులే కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. నిన్నటి దాకా భారత్ ను తక్కువ అంచనా వేసిన వాళ్లు ఇప్పుడు అత్యంత బలమైన , శక్తివంతమైన దేశంగా గుర్తిస్తున్నారు.
Pride Of India Sensation
దీనికి ప్రధాన కారణం చంద్రుడి వద్దకు ఉపగ్రహాన్ని పంపించిన ఏకైక దేశంగా చరిత్ర సృష్టించింది. ఇక తాజాగా పేరు పొందిన కంపెనీలకు సిఈవోలను చూస్తే విస్తు పోక తప్పదు. టెక్నాలజీ పరంగా శాసిస్తున్న గూగుల్ కంపెనీకి సిఇఓగా ఇండియాకు చెందిన సుందర్ పిచాయ్(Sundar Pichai) ఉన్నారు.
ఇక మైక్రో సాఫ్ట్ కు ఏపీకి చెందిన సత్య నాదెళ్ల కొలువు తీరారు. యూట్యూబ్ సీఈవో, అడోబ్ సీఈవో భారత్ కు చెందిన శాంతను నారాయణ్ , ప్రపంచ బ్యాంక్ సిఈవో గా మనోడే కొలువు తీరాడు. ఐబీఎం, అల్బర్ట్ సన్స్ , నెట్ యాప్ కంపెనీల సీఈవోలు కూడా మనోళ్లే ఉన్నారు.
పాలో ఆల్టో నెట్ వర్క్స్ , అరిస్టా నెట్ వర్క్స్ , నో వార్టిస్ , స్టార్ బక్స్ , మైక్రోన్ టెక్నాలజీ , హానీ వెల్ , ఫ్లెక్స్ , వే ఫెయిర్ , ఛానెల్ , ఓన్లీ ఫ్యాన్స్ , మోటారోలా , కాగ్ని జెంట్ , వీమియో కంపెనీలకు ముఖ్య కార్య నిర్వాహణ అధికారులుగా కొలువు తీరారు.
Also Read : TTD Chairman : శ్రీవారి అనుగ్రహంతో వర్షాలు కురవాలి