Bhatti Vikramarka : కాంగ్రెస్ పథకాలు బీఆర్ఎస్ కాపీ
ఆరోపించిన మల్లు భట్టి విక్రమార్క
Bhatti Vikramarka : తమ పార్టీకి చెందిన సంక్షేమ పథకాలను, ఇచ్చిన హామీలను భారత రాష్ట్ర సమితి పార్టీ కాపీ కొడుతోందని సంచలన ఆరోపణలు చేశారు సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క. పేదల సంక్షేమమే లక్ష్యంగా తాము వారికి మేలు చేకూర్చేలా ఎంతో కష్టపడి పథకాలను రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు.
Bhatti Vikramarka Comments on BRS
కానీ తమ పథకాలను నిస్సిగ్గుగా బీఆర్ఎస్ వాడుకోవడం సిగ్గు చేటు అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పాలన పడకేసిందని, ప్రజలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మల్లు భట్టి విక్రమార్క.
రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన దాఖలాలు లేవన్నారు. ఏ పరీక్ష నిర్వహించినా కోర్టుకు వెళ్లడమో లేదా నిలిచి పోవడమో జరుగుతోందన్నారు.
పొద్దస్తమానం ఐటీలో తెలంగాణ టాప్ అని చెప్పడమే తప్పా పేదల బతుకుల్లో ఏమైనా వెలుగులు నింపారా అని మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ప్రశ్నించారు. కేసీఆర్ కు కేవలం ఎన్నికలు, ఓట్లు , సీట్లు తప్ప ఇంకేమీ పట్టదని ధ్వజమెత్తారు.
రైతు బంధు పేరుతో బడా బాబులకు మేలు చేకూర్చడం తప్ప సీఎం చేసింది ఏమీ లేదని మండిపడ్డారు సీఎల్పీ నేత.
Also Read : Muttireddy Yadagiri Reddy : ‘పల్లా’ జనగాంతో నీకేం సంబంధం
