Onam Festival : దేశ వ్యాప్తంగా ఓనం సంబురం

కేర‌ళ‌లో అతి పెద్ద పండుగ

Onam Festival : దేశ వ్యాప్తంగా ఓనం పండుగ సంబురం కొన‌సాగుతోంది. కేర‌ళ రాష్ట్రంలో అతి పెద్ద పండుగ‌. మ‌ల‌యాళీ కాల‌గ‌మ‌నంలో తొలి నెల అయిన చింగం (ఆగ‌స్టు – సెప్టెంబ‌ర్ ) లో వ‌స్తుంది. ఈ ఫెస్టివ‌ల్ కేర‌ళ‌లో అతి పెద్ద పండుగ‌. ఇది మ‌హాబ‌లి ఈ ప్రాంతానికి తిరిగి రావ‌టాన్ని సూచిస్తుంది.

Onam Festival in Kerala

ఈ పండుగ ఆచారాలు, సంప్ర‌దాయాల‌తో ముడి ప‌డి ఉంది. చ‌క్క‌ని పూలు, భోజ‌నం, ప‌డ‌వ పందేలు, కైకొట్టిక‌లి నృత్యం అన్నీ ఇందులో స‌మ్మిళిత‌మై ఉంటాయి. ఫెస్టివ‌ల్ సంద‌ర్బంగా ప్ర‌జ‌లు త‌మ ఆనందాల‌ను పంచుకుంటారు. ప్ర‌త్యేకించి ఇది వ్య‌వ‌సాయ పండుగ కావ‌డం విశేషం.

ఓనం(Onam) ఆధునిక కాలంలో జ‌రుపుకునే ప్రాచీన పండుగ‌. వ‌ర్ష‌పు పువ్వుల పండుగ కూడా. కేర‌ళ ప్ర‌జ‌లు మ‌వేలి చ‌క్ర‌వ‌ర్తిని పూజించ‌డం మూలంగా ఓనం అత్యంత ప్ర‌త్యేక‌మైన‌ది. చ‌రిత్ర ప‌రంగా చూస్తే మ‌హాబ‌లి పాలించిన స‌మ‌యం కేర‌ళ‌కు స్వ‌ర్ణ యుగం. ఆనాటి పాల‌నా కాలంలో ప్ర‌తి ఒక్క‌రూ సుఖంగా, సిరి సంప‌ద‌ల‌తో ఉన్నారు.

ప్ర‌తి ఏటా ఒక‌సారి త‌న‌తో క‌లిసేందుకు మ‌హాబ‌లి రాజు అవ‌కాశం ఇచ్చాడు. ఈ అరుదైన క‌లయిక రోజును గుర్తు పెట్టుకునేందుకు వీలుగా ఓనం ఫెస్టివ‌ల్ ను నిర్వ‌హిస్తారు.

Also Read : Anand Mahindra : ప్ర‌జ్ఞానందకు మ‌హీంద్రా కారు గిఫ్ట్

Leave A Reply

Your Email Id will not be published!