Udhayanidhi Stalin : నా తల కోసం ఎవరు వస్తారో చూస్తా
నిప్పులు చెరిగిన ఉదయనిధి స్టాలిన్
Udhayanidhi Stalin : చెన్నై – తమిళనాడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ నిప్పులు చెరిగారు. మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తాను ఎవరికీ భయపడే ప్రసక్తి లేదన్నారు.
Udhayanidhi Stalin Comment
యూపీలోని అయోధ్యకు చెందిన ప్రముఖ సాధువు పరమహంస ఆచార్య సంచలన ప్రకటన చేశాడు. సనాతన ధర్మం గురించి కించ పర్చేలా మాట్లాడిన మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) పై భగ్గుమన్నారు. ఆయన ఫోటోను కత్తితో కోశాడు..ఆపై నిప్పంటించాడు. ఈ సందర్బంగా ఉదయనిధి స్టాలిన్ తల నరికి తీసుకు వచ్చిన వాళ్లకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు.
తలతో వచ్చిన వారికి ఎవరైనా సరే రూ. 10 కోట్లు బహుమానంగా ఇస్తానని స్పష్టం చేశాడు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. తన తలకు వెల కట్టిన ఆచార్యపై తీవ్ర స్థాయిలో స్పందించాడు ఉదయనిధి స్టాలిన్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తన తల నరికేందుకు ఎవరు వస్తారో చూస్తానని స్పష్టం చేశాడు. వారి కోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్పాడు. తన తల కు భారీ వెల కట్టిన ఆచార్యకు రూ. 10 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు ఉదయనిధి స్టాలిన్. దీంతో మరింత సీరియస్ గా మారింది కామెంట్స్ వ్యవహారం.
Also Read : Prashant Kishor : తెలంగాణలో గులాబీదే జెండా – పీకే