Anurag Thakur : న్యూఢిల్లీ – కేంద్ర క్రీడా, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది భారత్ అనే పేరు. గత కొంత కాలంగా భారత్ ను ఇండియా అని వ్యవహరిస్తూ వస్తున్నారు.
Anurag Thakur Announce
ఇండియా పేరును భారత్ గా మారుస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై తీవ్రంగా స్పందించారు. తాజాగా ఢిల్లీలో జరిగే జీ20 సదస్సుకు సంబంధించి ఆయా దేశాలను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో ఇన్విటేషన్లు పంపించారు.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా పేరును మార్చబోమంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తమ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదని పేర్కొన్నారు అనురాగ్ ఠాకూర్(Anurag Thakur). పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆరోపణలు వెల్లువెత్తాయి.
కేంద్ర సర్కార్ పై పెద్ద ఎత్తున విమర్శల పర్వం కొనసాగుతోంది. ప్రతిపక్షాల కూటమి ఇండియా భారీ ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వానికి డ్యామేజ్ చేసేలా ఉందనే భావన వ్యక్తం అవుతోంది. దీంతో ముందు జాగ్రత్తగా సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే భారత్ పేరును మార్చబోమంటూ పేర్కొన్నారు.
Also Read : Sanju Samson : శాంసన్ కథ కంచికేనా