Chandrababu Naidu Arrest : చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్

నంద్యాల‌లో అర్ద‌రాత్రి హై డ్రామా

Chandrababu Naidu Arrest : నంద్యాల – టీడీపీ చీఫ్‌, ఏపీ మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును అరెస్ట్ చేశారు. అర్ద‌రాత్రి నుంచే హై డ్రామా చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున టీడీపీ నాయ‌కులు, శ్రేణులు భారీగా చేరుకున్నారు. నంద్యాల‌లోని ఆర్కే ఫంక్ష‌న్ హాల్ కు భారీ బ‌ల‌గాల‌తో వ‌చ్చారు పోలీసులు. సీఐడీ చంద్ర‌బాబు నాయుడును అదుపులోకి తీసుకుంది.

Chandrababu Naidu Arrest Viral

స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ కేసులో మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu) ఏ1గా ఉన్నారు. దీంతో భారీ ఎత్తున పోలీసు బ‌ల‌గాలు చేరుకున్నాయి. పార్టీ శ్రేణుల‌ను ఎక్క‌డిక‌క్క‌డ నిలుపుద‌ల చేశారు. డీఐజీ ర‌ఘురామ‌రెడ్డి, జిల్లా ఎస్పీ ర‌ఘు వీరా రెడ్డి అక్క‌డికి చేరుకున్నారు. నేత‌లు, పోలీసుల మ‌ధ్య తోపులాట చోటు చేసుకుంది.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు నాయుడును అరెస్ట్ చేసేందుకు ఆయ‌న ప్ర‌ధాన సెక్యూరిటీ ఆఫీస‌ర్ , ఎన్ఎస్జీ అధికారుల‌తో డీఐజీ చ‌ర్చించారు. అర్ద‌రాత్రి ఎలా అరెస్ట్ చేస్తారంటూ వారు ప్ర‌శ్నించారు.
అర్ధరాత్రి చంద్రబాబు కాన్వాయ్‌ కదులుతోందనే సమాచారంతో ఇక్కడికి వచ్చామని.. వాహనాలను అడ్డు తొలగించాలని పోలీసులు వారికి సూచించారు.ఆయ‌న‌ను ముందుగా ఫ్లైట్ లో విజ‌య‌వాడ‌కు త‌ర‌లించాల‌ని.

Also Read : Dear Justice Comment : డియ‌ర్ జ‌స్టిస్ న్యాయానికి దిక్కేది

Leave A Reply

Your Email Id will not be published!