Sajjala Ramakrishna Reddy : చంద్రబాబు అరెస్ట్ సబబే
కక్ష సాధింపు లేదు
Sajjala Ramakrishna Reddy : తాడేపల్లి గూడెం – స్కిల్ డెవలప్ మెంట్ స్కీం స్కామ్ కు సంబంధించి టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ను నంద్యాలలో ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకుంది. దీనిపై స్పందించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy ) శనివారం మీడియాతో మాట్లాడారు.
Sajjala Ramakrishna Reddy Comments Viral
చంద్రబాబు నాయుడు అరెస్ట్ సబబేనని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి కక్ష సాధింపు ధోరణి లేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ 2019లో పవర్ లోకి వచ్చిందన్నారు. ఒకవేళ చంద్రబాబును అరెస్ట్ చేయాలని అనుకుంటే ఆరోజే అదుపులోకి తీసుకునే వాళ్లమన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి.
స్కామ్ చోటు చేసుకుందన్నది వాస్తవమేనని, తమ సర్కార్ 2021లో ఈ స్కీం స్కామ్ పై విచారణకు ఏపీ సీఎం జగన్ రెడ్డి ఆదేశించారని చెప్పారు. ఇందులో భాగంగానే సీబీఐ విచారణ చేపట్టిందని, సీఐడీ పక్కా ఆధారాలను సేకరించిందని వెల్లడించారు.
టీడీపీ శ్రేణులు ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. చంద్రబాబు నాయుడును అర్ధరాత్రి చేయలేదని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి. విచారణ సంస్థలు తమ పని తాము చేసుకుంటూ పోయాయని ఇందులో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవని కుండ బద్దలు కొట్టారు.
ఆయనకు తాను తప్పు చేసినట్లు ముందే తెలుసన్నారు. కోర్టు చంద్రబాబు నాయుడును ఏం చేయాలో తేలుస్తుందన్నారు. బాబు చేస్తున్నదంతా పొలిటికిల్ జిమ్మిక్కులంటూ ఎద్దేవా చేశారు.
Also Read : Chandrababu Naidu Scam : రూ. 371 కోట్ల ఏపీసీడీసీ స్కామ్