Pawan Kalyan Viral : ప‌వన్ క‌ళ్యాణ్ వైర‌ల్

రోడ్డుపై బైఠాయింపు

Pawan Kalyan Viral : విజ‌య‌వాడ – రాష్ట్రంలో రాజ‌కీయాలు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఏపీ ఏమైనా విదేశాల్లో ఉందా అని ప్ర‌శ్నించారు జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఆయ‌న రాక‌తో అర్ధ‌రాత్రి హై డ్రామా కొన‌సాగింది. త‌న‌ను ఎందుకు నిలుపుద‌ల చేస్తున్నారంటూ నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

Pawan Kalyan Viral on Road

ఆపై రోడ్డుపైనే బైఠాయించారు. ప‌డుకుని వినూత్నంగా ఆందోళ‌న చేప‌ట్ట‌డం క‌ల‌క‌లం రేపింది. చంద్ర‌బాబు నాయుడును అరెస్ట్ చేయ‌డాన్ని ఖండించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan). ఇది పూర్తిగా క‌క్ష సాధింపు చ‌ర్య త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

జ‌గ‌న్ కు పిచ్చి పీక్ స్టేజ్ కు చేరింద‌న్నారు. జ‌గ‌న్ సీఎం కాద‌ని ఓ క్రిమిన‌ల్ అంటూ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. మ‌రో వైపు నారా చంద్ర‌బాబు నాయుడును ఏపీ సీఐడీ ఏపీ స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి అరెస్ట్ చేసింది.

ఇందులో భాగంగా ఏసీబీ కోర్టులో ప్ర‌వేశ పెట్టింది. వాద‌న‌లు కొన‌సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చేప‌ట్టింది టీడీపీ. త‌నంత‌కు తానుగా చంద్ర‌బాబు నాయుడు వాద‌నలు వినిపించారు. త‌న అరెస్ట్ రాజ‌కీయ దురుద్దేశంతో కూడుకుని ఉన్న‌ద‌ని వాపోయారు.

Also Read : G20 Leaders Tribute : ఓ మ‌హాత్మా ఓ మ‌హ‌ర్షీ

Leave A Reply

Your Email Id will not be published!