RK Roja Selvamani : ప‌వ‌న్ కామెంట్స్ రోజా సెటైర్

అచ్చెన్నాయుడు అరెస్ట్ త‌ప్ప‌దు

RK Roja Selvamani : విజ‌య‌వాడ – ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి షాకింగ్ కామెంట్స్ చేశారు. జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై నిప్పులు చెరిగారు. ఆదివారం ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు. ఆయ‌న‌పై సెటైర్స్ వేశారు. చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ వ్య‌వ‌హారంలో స్వంత కొడుకు నారా లోకేష్ కంటే ఎక్కువ‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందిస్తున్నాడంటూ మండిప‌డ్డారు.

RK Roja Selvamani Comment Viral

ఎంత ప్యాకేజ్ ముట్టిందో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అంతులేని అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డిన చంద్రబాబు నాయుడు ,ఆయ‌న ప‌రివారానికి జైలు కూడు త‌ప్ప‌ద‌ని జోష్యం చెప్పారు ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి.

చివ‌ర‌కు పార్టీని, ఆస్తుల‌ను కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాజేస్తాడా అని ప‌వ‌న్ క‌ళ్యాణ్(RK Roja Selvamani) గురించి ఆందోళ‌న చెందుతున్నాడ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఏపీ మంత్రి. ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడుతున్న నారా లోకేష్ పప్పు నాయుడుతో పాటు అచ్చెన్నాయుడికి రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు త‌ప్ప‌ద‌న్నారు ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి.

త్వ‌ర‌లోనే వీరు కూడా అరెస్ట్ అవుతార‌ని , అన్యాయం గురించి ప్ర‌శ్నించాల్సిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ అక్ర‌మాల‌కు పాల్ప‌డిన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న చంద్ర‌బాబు గురించి ఎలా మ‌ద్ద‌తుగా మాట్లాడ‌తారంటూ ప్ర‌శ్నించారు ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి.

Also Read : Pawan Kalyan Viral : ప‌వన్ క‌ళ్యాణ్ వైర‌ల్

Leave A Reply

Your Email Id will not be published!