Chandrababu Naidu : అమాయకుడిని అరెస్ట్ చేస్తారా
కక్ష సాధింపు ధోరణితోనే అరెస్ట్
Chandrababu Naidu : విజయవాడ – టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి ఆయనను ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఏసీబీ కోర్డులో వాదనలు వినిపిస్తున్నాయి. స్వయంగా చంద్రబాబే తన వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు.
Chandrababu Naidu Comment
రిమాండ్ రిపోర్టును కావాలని తనను ఇరికించేందుకు తయారు చేశారని, దానిని వెంటనే తిరస్కరించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu). గవర్నర్ అనుమతి లేకుండా తనపై కేసు నమోదు చేయడం చట్టం విరుద్దమని ఆరోపించారు.
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలన్నది ఆనాటి కేబినెట్ తీసుకున్న నిర్ణయమని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీలు లేదని స్పష్టం చేశారు.
స్కిల్ డెవలప్ మెంట్ కు సంబంధించి 2015-2016 బడ్జెట్ లో పొందు పర్చినట్లు తెలిపారు. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులను ప్రశ్నించేందుకు అవకాశమే లేదన్నారు నారా చంద్రబాబు నాయుడు.
డిసెంబర్ 9, 2021న నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో రిమాండ్ రిపోర్టుకు సంబంధించి తన పాత్ర ఉందని సీఐడీ పేర్కొనలేదని అన్నారు. ఇదిలా ఉండగా ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ భారీ స్కామ్ కు ప్రధాన సూత్రధారి చంద్రబాబు నాయుడేనని ప్రకటించారు. షెల్ కంపెనీల ద్వారా డబ్బులు చేతులు మారాయని ఆరోపించారు.
Also Read : Gita Gopinath : రిషితో గీతా గోపీనాథ్ ముచ్చట
