Komatireddy Venkat Reddy : కోమటిరెడ్డికి హైకమాండ్ ఝలక్
పార్టీ హైకమాండ్ షాక్
Komatireddy Venkat Reddy : హైదరాబాద్ – భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. పార్టీ హైకమాండ్ తాజాగా ఏర్పాటు చేసిన కమిటీలలో ఏ ఒక్క దానిలో ఎంపిక చేయక పోవడం విస్తు పోయేలా చేసింది. ఇప్పటికే పార్టీ తన పట్ల అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు వెంకట్ రెడ్డి.
Komatireddy Venkat Reddy Viral
అధిష్టానం ఎందుకు తనపై ఇలా చేస్తుందోనని ఆవేదన చెందారు గతంలో. ఇటీవల సీడబ్ల్యూసీ, కాంగ్రెస్ ఎన్నికల కమిటీల్లో తనకు స్థానం కల్పించక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపై అలిగారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే , ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) నివాసానికి వెళ్లారు.
ఆయనను సముదాయించారు. పార్టీలో ఇక నుంచి తప్పకు ప్రయారిటీ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు హామీ కూడా ఇచ్చారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు తనను కలిసిన నేతలతో. ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలంగాణ లో ఎన్నిలకు సంబంధించి కొత్తగా 8 కమిటీలు వేసింది. ఒక్క దానిలో కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి స్థానం దక్కలేదు.
ఇదిలా ఉండగా కీలకమైన ఎన్నికల నిర్వహణ కమిటీ, మేనిఫెస్టో కమిటీలకు మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజ నరసింహ, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును నియమించింది. కానీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఛాన్స్ దక్కలేదు.
Also Read : Anil Kumar Yadav : చంద్రబాబు పాపం పండింది
