Chandrababu Naidu Arrest : స్కిల్ స్కామ్ లో జడ్జి కీలక తీర్పు
చంద్రబాబుకు 409 సెక్షన్ వర్తిస్తుంది
Chandrababu Naidu Arrest : విజయవాడ – టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఏపీ స్కిల్ స్కామ్ లో కీలక పాత్ర పోషించారని ఆరోపిస్తూ ఏపీ సీఐడీ 25 పేజీల రిమాండ్ రిపోర్ట్ జడ్జి ముందు ప్రవేశ పెట్టింది. ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించారు.
Chandrababu Naidu Arrest Viral
నారా చంద్రబాబు నాయుడు తరపున ప్రముఖ లాయర్ సిద్దార్థ్ లూథ్రా తో పాటు వెంకటేశ్వర్ రావు వాదించారు. గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని , ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు(Chandrababu Naidu) పేరు నమోదు చేయలేదని, ఆ తర్వాత నమోదు చేశారని వాదించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు సుధాకర్ రెడ్డి.
గవర్నర్ కు తెలియ చేయాల్సిన అవసరం లేదని, స్పీకర్ కు తెలియ పరిస్తే చాలన్నారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే కానీ మాజీ సీఎం అన్నది గతంలో తప్ప , అంతగా విలువ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించి ఎలాంటి తీర్పు వస్తుందోనని ఉత్కంఠకు తెర దించారు జడ్జి. 409 సెక్షన్ వర్తిస్తుందని సంచలన తీర్పు వెలువరించారు జడ్జి. 14 రోజుల జ్యుడిషియల్ విధించారు. సోమవారం చంద్రబాబు నాయుడును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు పోలీసులు.
Also Read : Chandrababu Naidu : చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్
