Gudivada Amarnath : చంద్రబాబు చట్టానికి అతీతుడు కాదు
ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్
Gudivada Amarnath : విజయవాడ – ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కీం స్కామ్ లో అరెస్ట్ అయి రాజమండ్రి జైలు పాలైన మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ . ఈ దేశంలో సామాన్యులకైనా మాజీ సీఎంకైనా చట్టం ఒకేలా ఉంటుందని స్పష్టం చేశారు.
Gudivada Amarnath Comments on Chandrababu
అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు కనుకనే ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిందన్నారు. రూ. 371 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, షెల్ కంపెనీల ద్వారా ముడుపులు తీసుకున్నారని స్పష్టమైందన్నారు. ఈ విషయాన్ని పక్కా ఆధారాలతో సహా రిమాండ్ రిపోర్టు తయారు చేసిందన్నారు గుడివాడ అమర్నాథ్.
గంటకు లక్షల రూపాయలు చెల్లించి ఢిల్లీ నుంచి ప్రముఖ న్యాయవాదులను తెచ్చుకున్నా అవినీతి కేసులో చంద్రబాబు నాయుడు(Gudivada Amarnath) అడ్డంగా బుక్కయ్యారంటూ మండిపడ్డారు. ఏదో ఒక రోజు పాపం పండుతుందని ప్రస్తుతం అది నిరూపితమైందని అన్నారు గుడివాడ అమర్నాథ్.
చంద్రబాబు నాయుడుకు లోకేష్ ఉత్త పుత్రుడని, పవన్ దత్త పుత్రుడంటూ ఎద్దేవా చేశారు. తమను చంపేందుకు కుట్ర పన్నారంటూ పవన్ కళ్యాణ్ చేయడం దారుణమన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు గుడివాడ అమర్నాథ్.
Also Read : Kodali Nani : జగన్ తో పెట్టుకుంటే జైలుకే
