Perni Nani : స‌రైనోడి చేతికి చంద్ర‌బాబు చిక్కారు

మాజీ మంత్రి పేర్ని నాని షాకింగ్ కామెంట్స్

Perni Nani : విజ‌య‌వాడ – ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ స్కీం స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై నిప్పులు చెరిగారు పేర్ని నాని(Perni Nani ). స‌రైనోడి చేతికి చంద్ర‌బాబు చిక్కారంటూ స్ప‌ష్టం చేశారు. నిద్ర పోతున్న‌ట్టు న‌టించాడ‌ని, ముందే త‌న అరెస్ట్ విష‌యం తెలుస‌న్నారు.

Perni Nani Slams Chandrababu

సోమవారం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. 45 ఏళ్లుగా అవినీతికి పాల్ప‌డుతూనే వ‌చ్చాడ‌ని ఆరోపించారు. ఇన్నాళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని , వ్య‌వ‌స్థ‌ల‌ను మ్యానేజ్ చేస్తూ వ‌చ్చాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. కానీ ఇప్పుడు ఆ సీన్ రివ‌ర్స్ అయ్యింద‌న్నారు.

గ‌త రెండు రోజులుగా మీరు చేస్తున్న వేషాలు చూసి త‌ట్టుకోలేక పోతున్నామ‌ని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో హైద‌రాబాద్ ను కేసీఆర్ కు అప్ప‌జెప్పిన ఘ‌న‌త నీది కాదా అంటూ చంద్ర‌బాబు నాయుడును నిల‌దీశారు.

ఏపీ సీఐడీ చాలా మ‌ర్యాద ఇస్తూ ప్ర‌వ‌ర్తించింద‌న్నారు. ఈ కేసు తీగ మాత్ర‌మేన‌ని, ఇంకా కేసులు బ‌య‌ట ప‌డాల్సి ఉంద‌న్నారు పేర్ని నాని. డీఐజీ స్థాయి అధికారిపై నోరు పారేసు కోవ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.

రూ. 371 కోట్ల రూపాయ‌లు కొల్ల‌గొట్టిన దొంగ‌ను చూసిన‌ట్లు చూడ‌లేద‌న్నారు. హెలికాప్ట‌ర్ లో వెళ‌దామ‌ని కోరినా చంద్ర‌బాబు ప‌ట్టించు కోలేద‌న్నారు. తానే త‌న కారులో వ‌స్తాన‌ని చెప్పింది నిజం కాదా అని నిల‌దీశారు.

Also Read : AP ACB Court : చ‌ట్టం ఎవ‌రికీ చుట్టం కాదు

Leave A Reply

Your Email Id will not be published!