Minister KTR : ఏప్రిల్ లేదా మేలో అసెంబ్లీ ఎన్నిక‌లు

మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

Minister KTR : హైద‌రాబాద్ – తెలంగాణ ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR) షాకింగ్ కామెంట్స్ చేశారు. త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌రుగుతాయంటూ వ‌స్తున్న ప్ర‌చారంపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. మంగ‌ళ‌వారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

Minister KTR Comment

అక్టోబ‌ర్ 10 లోపు నోటిఫికేష‌న్ వ‌స్తేనే తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని పేర్కొన్నారు. ఆ స‌మ‌యంలోగా నోటిఫికేష‌న్ వ‌చ్చేది అనుమాన‌మేన‌ని అన్నారు. దీంతో తెలంగాణ‌లో శాస‌న‌స‌భ ఎన్నిక‌లు కూడా ఏప్రిల్ లేదా మే నెల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌వ‌చ్చ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి కేటీఆర్.

ఇదిలా ఉండ‌గా బీఆర్ఎస్ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు రాబోతున్నాయ‌ని, ఏకంగా 119 సీట్ల‌కు గాను 115 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు. ఆపై 7 సీట్ల‌లో అభ్య‌ర్థుల‌కు మొండి చేయి చూపించారు.

మ‌రికొంద‌రికి వ‌చ్చే స‌మ‌యంలో ఎమ్మెల్సీ, ఎంపీలుగా ఛాన్స్ ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. దీంతో ఎన్నిక‌లు ఇప్పుడే వ‌స్తాయంటూ ప్ర‌తిప‌క్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. తాజాగా కేటీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది.

Also Read : RTC Bus Theift Arrest : దొరికిన ఆర్టీసీ బ‌స్సు దొంగ

Leave A Reply

Your Email Id will not be published!