RK Roja Selvamani : గంగమ్మ తల్లికి రోజా సారె సమర్పణ
పోటెత్తిన భక్త బాంధవులు
RK Roja Selvamani : నగరి – చిత్తూరు జిల్లా నగరిలో అంగరంగ వైభవోపేతంగా గంగమ్మ జాతర ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి హాజరయ్యారు. ఆమె ఈ ప్రాంతానికి శాసనసభ సభ్యురాలిగా ఉన్నారు.
RK Roja Selvamani Visits Tirumala Gangamma Temple
ప్రతి ఏటా గంగమ్మ తల్లి జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గంగమ్మ తల్లికి సారె సమర్పించేందుకు భక్తులు పోటీ పడతారు. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గంగమ్మ తల్లికి సారెను సమర్పిస్తారు.
ఇదిలా ఉండగా ఏపీ మంత్రి కె. రోజా సెల్వమణి(RK Roja Selvamani ) టీటీడీ తరపున గంగమ్మ తల్లికి సారెను సమర్పించారు. మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో , కలిసికట్టుగా ఉండాలని ఆ గంగమ్మ తల్లిని వేడుకున్నానని ఈ సందర్భంగా మంత్రి కె. రోజా సెల్వమణి చెప్పారు.
గంగమ్మ తల్లి జాతరకు వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. అమ్మ వారికి సారెను సమర్పించేందుకు పోటెత్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం, ఆలయ కమిటీ నిర్వాహకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి సౌకర్యాలు చేపట్టారు.
Also Read : Yogendra Yadav : దేశానికి నిప్పు పెడుతున్న నేతలు