Shashi Tharoor : పోటెత్తిన జనం థరూర్ ఆశ్చర్యం
తుక్కుగూడలో విజయ భేరి సభ తుక్కుగూడలో విజయ భేరి సభ
Shashi Tharoor : హైదరాబాద్ – ఏఐసీసీ వర్కింగ్ కమిటీ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుతం తిరువనంతపురం ఎంపీగా ఉన్న శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయ భేరి సభను నిర్వహించారు. ఈ సభకు లక్షలాది మంది జనం స్వచ్చంధంగా తరలి వచ్చారు.
Shashi Tharoor Comments Viral
పార్టీ శ్రేణులను , ప్రత్యేకించి రచయితగా గుర్తింపు పొందిన శశి థరూర్ (Shashi Tharoor)ను విపరీతంగా విస్తు పోయేలా చేసింది. సభలో పాల్గొన్న తాను ఇంత పెద్ద ఎత్తున హాజరవుతారని తాను అనుకోలేదని పేర్కొన్నారు. సోమవారం శశి థరూర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీలో శశి థరూర్ రెబల్ గా గుర్తింపు పొందారు. కానీ ఆయన తొలిసారిగా ఇలా పార్టీ పట్ల పాజిటివ్ గా స్పందించడం పార్టీ శ్రేణులను, ఏఐసీసీ నేతలను ఆశ్చర్య పోయేలా చేసింది.
ఇది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ 10 లక్షల మంది హాజరవుతారని అంచనా వేసింది. కానీ అంతకంటే ఎక్కువగా తమంతకు తాముగా తుక్కుగూడ విజయ భేరి సభకు విచ్చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికార పార్టీ పాలనకు వ్యతిరేకంగా ఈ జనం వచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది.
Also Read : Congress 6 Guarentees : కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలు ఇవే