Congress 6 Guarentees : కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలు ఇవే

తుక్కుగూడ విజ‌య భేరి స‌భ‌లో

Congress 6 Guarentees : హైద‌రాబాద్ – రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన విజ‌య భేరి స‌భ స‌క్సెస్ అయ్యింది. ఏఐసీసీ మాజీ చీఫ్, సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తీపి క‌బురు చెప్పారు.

ఈ మేర‌కు మ‌హిళ‌ల‌కు పెద్ద పీట వేశారు. ఇందులో భాగంగా తెలంగాణ‌లో గ‌నుక కాంగ్రెస్(Congress) పార్టీని అధికారంలోకి తీసుకు వ‌స్తే ఆరు హామీల‌ను త‌ప్ప‌కుండా అమ‌లు చేసి తీరుతామ‌ని ప్ర‌క‌టించారు. కేబినెట్ కొలువు తీరిన రోజు నుంచే ఈ ఇచ్చిన గ్యారెంటీలను వ‌ర్తింప చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. పార్టీ ప్ర‌క‌టించిన ఆరు హామీలు ఇలా ఉన్నాయి.

Congress 6 Guarentees to Telangana

1. మహాలక్ష్మి స్కీమ్ – మహిళలకు ప్రతి నెలా రూ. 2,000 సాయం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్.
2. రైతుభరోసా – రైతులు, కౌలురైతులకు ఏటా రూ. 15,000 పంట పెట్టుబడి సాయం. వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000 సాయం. వరి పంటకు ప్రతి క్వింటాల్‌కు రూ. 500 బోనస్.

3. గృహజ్యోతి – ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు.
4. ఇందిరమ్మ ఇండ్లు – ఇల్లు లేనివారికి ఇంటి స్థలంలో నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం. ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల స్థలం కేటాయింపు.

5. యువ వికాసం – విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు. ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్.
6. చేయూత – నెలకు రూ. 4,000 చొప్పున పింఛను. రూ. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా

Also Read : DK Shiva Kumar : తెలంగాణ‌లో అధికారం ఖాయం – డీకే

Leave A Reply

Your Email Id will not be published!