MLC Kavitha : కాంగ్రెస్..ఎన్సీపీపై కవిత గుస్సా
మహిళా బిల్లుపై మీరే క్రెడిట్ తీసుకోండి
MLC Kavitha : హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి బాస్ , తెలంగాణ సీఎం కేసీఆర్ తనయురాలు , ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. మహిళా బిల్లు ప్రవేశ పెట్టాలని ఆమె గత కొంత కాలం నుంచీ డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఎంపీగా ఉన్న సమయంలో సైతం దీని గురించి ప్రస్తావించారు. లోక్ సభలో తమకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు.
MLC Kavitha Comment
దేశ రాజధాని ఢిల్లీలో సైతం మహిళా బిల్లు ప్రవేశ పెట్టాలని కోరుతూ మహిళలతో కలిసి ధర్నా చేపట్టారు. తాజాగా పార్లమెంట్ లో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ సంచలన ప్రకటన చేశారు. మహిళా బిల్లు ప్రవేశ పెడుతున్నామని స్పష్టం చేశారు.
దీనిపై తీవ్రంగా స్పందించారు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha). మంగళవారం ఆమె జాతీయ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పార్టీలు మొదటగా తామే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడామని అంటున్నాయని అన్నారు.
అయితే ఆ పార్టీలు క్రెడిట్ తీసుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. క్రెడిట్ తీసుకునేటప్పుడు వారంతా బిల్లుకు మద్దతు ఇవ్వాలని , ఓటు వేయాలని డిమాండ్ చేశారు.
Also Read : Indian New Parliament : భారత పార్లమెంట్ కు కొత్త పేరు