Kumar Sangakkara : లంక ఓపెనింగ్ జోడీ మారాలి – సంగ‌క్క‌ర‌

మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్

Kumar Sangakkara : శ్రీ‌లంక జ‌ట్టు మాజీ కెప్టెన్ , రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు హెడ్ కోచ్ , ప్ర‌ముఖ కామెంటేట‌ర్ కుమార సంగ‌క్క‌ర(Kumar Sangakkara) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఆసియా క‌ప్ లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసింది శ్రీ‌లంక జ‌ట్టు. ఇదే స‌మ‌యంలో సెమీస్ లో దాయాది పాకిస్తాన్ జ‌ట్టుకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది.

Kumar Sangakkara Comments Viral

కానీ ఫైన‌ల్ లో రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోని టీమిండియా చేతిలో చేతులెత్తేసింది శ్రీ‌లంక‌. ఈ సంద‌ర్భంగా కుమార సంగ‌క్క‌ర మంగ‌ళ‌వారం అంత‌ర్జాతీయ మీడియాతో మాట్లాడారు. కీల‌క సూచ‌న‌లు చేశాడు త‌మ జ‌ట్టుకు.

కొన్ని మార్పులు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ ప‌డ్డాడు. ఈ ఏడాది భార‌త క్రికెట్ కంట్ర‌ల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వ‌ర్యంలో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది. క‌ప్ లో పాల్గొనే ముందు శ్రీ‌లంక టీమ్ లో త‌న ఓపెనింగ్ జోడీని మార్చాల‌ని, మ‌రింత ఫోక‌స్ పెడితే అద్భుత‌మైన ఫ‌లితాలు వ‌చ్చే ఛాన్స్ ఉంద‌న్నాడు కుమార సంగక్క‌ర‌.

ఇప్ప‌టికే ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్ ప్ర‌క‌టించింది. హైబ్రిడ్ ప‌ద్ద‌తిలో ప్ర‌పంచ క‌ప్ జ‌ర‌గ‌నుంది.

Also Read : MLC Kavitha : కాంగ్రెస్..ఎన్సీపీపై క‌విత గుస్సా

Leave A Reply

Your Email Id will not be published!