Elon Musk : ట్విట్టర్ యూజర్లకు మస్క్ బిగ్ షాక్
ఇక నుంచి ప్రతి ఒక్కరికీ ఫీజు చెల్లించాలి
Elon Musk :టెస్లా చైర్మన్, ట్విట్టర్ సిఇవో ఎలోన్ మస్క్(Elon Musk) సంచలన ప్రకటన చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ట్విట్టర్ ను వాడుతున్నారు. ప్రతి రోజూ కోట్లాది ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. ఎన్నో మార్పులు తీసుకు వస్తున్నారు ఎలోన్ మస్క్.
Elon Musk Shocking Decision
ఎవరూ ఊహించని రీతిలో ట్విట్టర్ ను భారీ ధరకు కొనుగోలు చేశారు సిఈవో. ఆనాటి నుంచి నేటి దాకా ప్రతి రోజూ ఏదో ఒక షాకింగ్ నిర్ణయంతో హల్ చల్ చేస్తున్నారు. ఇప్పటికే బ్లూ టిక్ కావాలంటే ఫీజు చెల్లించాలని స్పష్టం చేశాడు.
తాజాగా మరో కీలక ప్రకటన చేశాడు. ఇక నుంచి ట్విట్టర్ ను ఉచితంగా వాడేందుకు వీలు లేదని స్పష్టం చేశాడు. ట్విట్టర్ ను విద్వేషాలకు వేదికగా వాడుతున్నారనే ఆరోపణలు లేక పోలేదు. ఈ తరుణంలో ప్రతి ఒక్కరు నెలకు కొంత మొత్తం చెల్లించేలా నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు స్పష్టం చేశాడు ఎలోన్ మస్క్.
దీంతో కోట్లాది మంది యూజర్లకు కోలుకోలేని బిగ్ షాక్ అని చెప్పక తప్పదు. ఇప్పటికే ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా ఫేస్ బుక్ సిఇఓ మార్క్ జుకెర్ బర్గ్ థ్రెర్డ్స్ ను తీసుకు వచ్చింది. ఒకవేళ డబ్బులు కట్టాలని నిర్ణయిస్తే ట్విట్టర్ కు గణనీయంగా ఆదాయం లభిస్తుంది. ఇదే సమయంలో యూజర్లు తొలగి పోయే ప్రమాదం లేక పోలేదు.
Also Read : Kumar Sangakkara : లంక ఓపెనింగ్ జోడీ మారాలి – సంగక్కర