Chandrababu Naidu : మందుస్తు బెయిల్ పిటిష‌న్ వాయిదా

నారా చంద్ర‌బాబు నాయుడుకు షాక్

Chandrababu Naidu : అమ‌రావ‌తి – ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ స్కీం స్కామ్ లో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొని ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో రిమాండ్ ఖైదీగా కొలువు తీరారు. మంగ‌ళ‌వారం నాటితో 10 రోజులు పూర్త‌య్యాయి. త‌న‌కు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ క్వాష్ పిటిష‌న్ తో పాటు బెయిల్ మంజూరు చేయాల‌ని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

Chandrababu Naidu Bail Petition Postoned

ఇవాళ విచారించిన కోర్టు చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu) ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది. బెయిల్ పిటిష‌న్ ను 22 వ‌ర‌కు వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది కోర్టు. ప్ర‌స్తుతం క్వాష్ పిటిష‌న్ పై ఇరు ప‌క్షాల త‌ర‌పున వాదోప‌వాద‌న‌లు కొన‌సాగుతున్నాయి.

ఇదిలా ఉండ‌గా ఏపీ స్కిల్ స్కామ్ లో రూ. 371 కోట్ల స్కాం చోటు చేసుకుంద‌ని ఏపీ సీఐడీ కేసు న‌మోదు చేసింది. నంద్యాల‌లో ఉండ‌గా చంద్ర‌బాబును అదుపులోకి తీసుకుంది. కాంచ‌న్ ప‌ల్లిలో 10 గంట‌ల పాటు విచారించింది. ఒక్క ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇవ్వ‌లేద‌ని సీఐడీ ఆరోపించింది.

అక్క‌డి నుంచి ఏసీబీ కోర్టుకు త‌ర‌లించారు. ఆరున్న‌ర గంట‌ల‌కు పైగా వాద‌న‌లు విన్న జ‌డ్జి హిమ బిందు షాక్ ఇచ్చారు. చంద్ర‌బాబు నాయుడుకు 14 రోజులు రిమాండ్ విధించారు.

Also Read : Asaduddin Owaisi : థ‌ర్డ్ ఫ్రంట్ కు కెప్టెన్ గా కేసీఆర్ బెట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!