TTD Chairman : శ్రీవారి భక్తుల భద్రతకు పెద్దపీట – చైర్మన్
భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం
TTD Chairman : తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ , తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పుణ్య క్షేత్రంలో కొలువు తీరిన శ్రీనివాసుడిని, శ్రీ అలివేలు మంగమ్మలను నిత్యం దర్శించుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
TTD Chairman Comments
ప్రత్యేకించి అలిపిరి నడక దారిన, శ్రీవారి మెట్లు ద్వారా నడిచి వచ్చే భక్తులకు అటవీ శాఖ సూచన మేరకు చేతి కర్రలను అందజేస్తున్నామని తెలిపారు. ఇవాళ ఊహించని రీతిలో చిరుత బోనులో చిక్కింది. 2,850 వ మెట్టు దగ్గర ఉన్న నరసింహ్మ స్వామి టెంపుల్ అటవీ శాఖ బోనును ఏర్పాటు చేసింది.
దీంతో చిరుత ఎరక్క పోయి ఇరుక్కుంది. బోనులోకి చేరింది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు తిరుమల అటవీ ప్రాంతంలో చిక్కిన చిరుత ఆరవది కావడం విశేషం. ఇప్పటి వరకు 5 చిరుతలు బోనులో పడ్డాయి. ఇవాళ బోనులో ఉన్న చిరుత ప్రాంతాన్ని సందర్శించారు టీటీడీ చైర్మన్(TTD Chairman) భూమన కరుణాకర్ రెడ్డి, ఏవో ఏవీ ధర్మా రెడ్డి.
యాత్రికుల భద్రత విషయంలో టీటీడీ చిత్తశుద్దితో పని చేస్తుందని చెప్పారు. భక్తులకు కేవలం కర్రలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపు కోలేదన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.
Also Read : Sonia Gandhi : సోనియా గాంధీ వైరల్