Sonia Gandhi : సోనియా గాంధీ వైర‌ల్

ప్ర‌ధాని మోదీకి అభివాదం

Sonia Gandhi : న్యూఢిల్లీ – నూతన పార్ల‌మెంట్ భ‌వ‌న‌లో అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. భారీ ఎత్తున ఖ‌ర్చు చేసి నూత‌న భ‌వ‌నాన్ని నిర్మించారు. దీనిని పీఎం ప్రారంభించారు. సెప్టెంబ‌ర్ 19న మంగ‌ళ‌వారం లోక్ స‌భ‌, రాజ్య స‌భ స‌మావేశాలు ప్రారంభం అయ్యాయి.

Sonia Gandhi Viral

ఈ సంద‌ర్బంగా పార్ల‌మెంట్ భ‌వ‌న‌లోకి ప్ర‌వేశించారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. స‌భ‌లోని ఎంపీలంతా లేచి నిల‌బ‌డ్డారు. పీఎంకు అభివాదం చేశారు. ఇందులో భాగంగా సీపీపీ చైర్ ప‌ర్స‌న్ , ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ(Sonia Gandhi) లేచి నిల‌బడ్డారు. పీఎంకు న‌మ‌స్కారం పెట్టారు.

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది. మోదీ ఎంత‌టి శ‌క్తివంత‌మైన నాయ‌కుడో దీనిని చూస్తే తెలుస్తుంద‌ని భార‌తీయ జ‌నతా పార్టీ ట్విట్ట‌ర్ లో పేర్కొంది. దీనిని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు బీజేపీ నాయ‌కుడు రాకేష్ రెడ్డి.

ఈ ఫోటోకు ఎలాంటి క్యాప్ష‌న్ అక్క‌ర్లేద‌ని, మోదీ పులి , సింహం లాంటోడ‌ని పేర్కొన్నాడు. మొత్తంగా చూస్తే నూత‌న పార్ల‌మెంట్ ప్రారంభ‌మైన వెంట‌నే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన మ‌హిళా బిల్లును ప్ర‌వేశ పెట్టింది కేంద్రంలో కొలువు తీరిన మోదీ భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్.

Also Read : Minister KTR : డేటా సెంట‌ర్ల‌కు హైద‌రాబాద్ కేరాఫ్

Leave A Reply

Your Email Id will not be published!