BCCI SBI Life : బీసీసీఐతో ఎస్బీఐ లైఫ్ ఒప్పందం
2023 నుంచి 2026 దాకా
BCCI SBI Life : ముంబై – భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. బీసీసీఐ ఆధ్వర్యంలో త్వరలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే వరల్డ్ కప్ నిర్వహించనుంది. దీంతో పాటు ఆసియా క్రీడలు, ఇతర దేశాలలో క్రికెట్ టూర్లలో అధికారిక భాగస్వామిగా దేశంలోనే అత్యుత్తమమైన బ్యాంక్ గా పేరు పొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కి చెందిన ఎస్బీఐ లైఫ్ ను ప్రకటించింది.
BCCI SBI Life as a Official Partner
ఈ విషయాన్ని బీసీసీఐ(BCCI) కార్యదర్శి జే షా గురువారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ ఒప్పందంలో భాగంగా బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించే దేశీయ టోర్నీలు, మ్యాచ్ లు , అంతర్జాతీయ సీజన్ లకు సంబంధించి ఆడే భారత జట్టు మ్యాచ్ లకు అధికారికంగా స్పాన్సర్ గా ఉంటుందని స్పష్టం చేశారు.
బీసీసీఐ – ఎస్బీఐ భాగస్వామ్యం ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు మ్యాచ్ ల వన్డే సీరీస్ నుంచే ప్రారంభం అవుతుందని బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీ వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన క్రీడా సంస్థగా పేరు పొందింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. సంస్థతో ఒప్పందం కలిగి ఉండడం ఆనందంగా ఉందన్నారు ఎస్బీఐ బ్రాండ్, కార్పొరేట్ కమ్యూనికేషన్ , సీఎస్ఆర్ చీఫ్ రవీంద్ర శర్మ.
ఇక వన్డే వరల్డ్ కప్ నిర్వహణకు సంబంధించి బీసీసీఐ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని ప్రముఖులకు గోల్డెన్ టికెట్లను అందజేస్తోంది.
Also Read : Womens Bill Comment : మహిళా బిల్లుతో మార్పు రానుందా