AP Assembly : మీసం తిప్పిన బాల‌య్య అంబ‌టి వార్నింగ్

ఇది సినిమా కాద‌న్న మంత్రి రాంబాబు

AP Assembly : ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న స‌భ స‌మావేశాలు వాడి వేడిగా కొన‌సాగాయి. మాట‌ల తూటాలు పేలాయి. గురువారం ప్రారంభ‌మైన అసెంబ్లీలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. త‌న బావ , టీడీపీ చీఫ్ , ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu) అరెస్ట్ కావడాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు ప్ర‌ముఖ న‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌.

AP Assembly Viral

ఈ సంద‌ర్బంగా ఆయ‌న తీవ్ర స్థాయిలో రెచ్చి పోయారు. ఏకంగా ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌జా ప్ర‌తినిధుల సాక్షిగా అసెంబ్లీలో మీసాలు తిప్పారు. దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు. వెంట‌నే స్పందించారు ఏపీ నీటి పారుద‌ల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు.

ద‌మ్ముంటే రా అంటూ స‌వాల్ విసిరారు మంత్రి. మీసం ఇక్క‌డ కాదు తిప్పాల్సింది..సినిమాల‌లో తిప్పాల‌ని సూచించారు. మీ బెదిరింపుల‌కు ఇక్క‌డ భ‌య‌ప‌డే వాళ్లు ఎవ‌రూ లేర‌ని హెచ్చ‌రించారు. అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వారు ఎవ‌రైనా స‌రే జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌ద‌న్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

టీడీపీ స‌భ్యుల‌తో కలిసి పోడియం వ‌ద్ద‌కు చేరారు టీడీపీ ఎమ్మెల్యే శ్రీ‌దేవి.

Also Read : Mutyapu Pandiri Vahanam : ముత్య‌పు పందిరి వాహ‌నంపై శ్రీ‌వారు

Leave A Reply

Your Email Id will not be published!